తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి ఇప్పటికే అనేక బయోపిక్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కాయి. స్వయంగా నందమూరి బాలకృష్ణ గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి రెండు పార్టులుగా సినిమా చేయడం జరిగింది. ఒకటి సినిమా రంగానికి సంబంధించిన అయితే మరొకటి రాజకీయ రంగానికి సంబంధించింది. రెండూ కూడా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఇదే తరుణంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీ రామారావు జీవిత కోణంలో ఎవ్వరు చూడని కోణం అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా పై అనేక విమర్శలు రావడం జరిగాయి.

 

ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో ఆంధ్రలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైకాపాలో కీలకంగా ఉన్న మోహన్ బాబు మరోసారి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర నీ తెరకెక్కించడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే మోహన్ బాబు రాజకీయాలలో మరియు సినిమారంగంలో నందమూరి తారక రామారావు కి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళని అందరికీ తెలిసినదే.

 

రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా మోహన్ బాబు రాణించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల టిడిపిని విడిపోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో చాలా రోజుల తర్వాత మోహన్ బాబు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర వెబ్ సిరీస్ లో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు కూడా ఈ వార్తని కన్ఫాం చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విష్ణు పెట్టిన పోస్ట్ ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవ్వబోతుంది.   ‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్‌ ఇస్తుంది’’ అని మంచు విష్ణు పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: