టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు గా పరిచయం అయ్యారు.. కానీ కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకున్నారు.  అందం.. అభినయం ఉన్నా కూడా కొంత మంది నటీమణులకు సరైన అవకాశాలు రావు.. ఒకవేళ వచ్చిన ఆ సినిమాలు మంచి సక్సెస్ కావు. దాంతో ఆ హీరోయిన్లతో నటింపజేసేందుకు దర్శక, నిర్మాతలు సుముఖత చూపించరు. అదే సక్సెస్ ఫుల్ హీరోయిన్లు అయితే వరుస ఛాన్సులు వస్తుంటాయి.  అలా ఛాన్సులు కొట్టేసిన వారు ఇతర భాష హీరోయిన్లు కూడా ఉంటున్నారు.  తాజాగా హీరోయిన్ ‘శ్రద్దా దాస్’ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ భామ ఎలాంటి గ్లామర్ షో చేయడానికైనా పూర్తి సిద్దంగా ఉంటుంది.  నటన పెద్దగా స్కోప్ లేకున్నా స్కిన్ షోకి బాగా రెడీ అవుతుంది. ఆ మద్య సినిమా అవకాశాలు రాకపోవడంతో బికినీ తో పిచ్చెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  

 

చీర కట్టు అందాలతో కుర్రాళ్ల మనసు దోచింది. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ సినిమాల్లో కనిపించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కొంత కాలంగా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఈ హాట్ బ్యూటీ. అందుకేనేమో అడల్ట్ పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. తాజాగా ప్రముఖ కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీలో జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాలో శ్రద్దా దాస్ ఒక వేశ్య పాత్రలో నటిస్తోందట. 

 

అయితే హీరో, హీరోయిన్ల మద్య లిప్ లాక్ సీన్లు బాగానే ఉండబోతున్నట్లు సమాచారం.  ఎలాంటి బోల్డ్ సీన్స్ లోనైనా ‘శ్రద్దా దాస్’ చాల ఈజీగా నటించేస్తోందట. ఒక విధంగా వేశ్య పాత్రకే కొత్త గ్లామర్ అద్దుతున్న అందుతుందట. మరి ఈ సారైనా ‘శ్రద్దా దాస్’కి హిట్ వచ్చి స్టార్ డమ్ తో పాటు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: