హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం భీష్మ‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇక చిత్ర యూనిట్ నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం భీష్మ క‌థేమిటంటే...

 

హీరో నితిన్ పేరు భీష్మ‌. మీమ్స్ త‌యారీ అత‌ని బిజినెస్ క‌థ చాలా స‌ర‌దాగా ఫ‌న్నీగా సాగుతుంది. విల‌న్‌కి వార్నింగ్ ఇచ్చే ప‌ద్ధ‌తి కూడా ఎంతో ఫ‌న్నీగా చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇంత ఫ‌న్నీగా వెళుతూ ఉండే హీరో ప్రేమ కోసం పెద్ద ప్రాబ్ల‌మ్‌లో ప‌డ‌తాడు. ఓ రోజు అనుకోకుండా ర‌ష్మిక‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. దాంతో ఆమెను  ఫాలో అయి వెంట ప‌డుతుంటాడు. ర‌ష్మిక ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. 

 

ఇక ర‌ష్మిక ఈ చిత్రంలో హీరోని పెద్ద‌గా లెక్క చెయ్య‌దు. త‌ను ప‌నీ పాట లేకుండా ఉద్యోగం, స‌ద్యోగం లేకుండా తిరుగుతుంటాడ‌ని ప‌ట్టించుకోదు. భీష్మ అగ్రి కల్చర్ కంపెనీ ఓనర్ అంటాడు. కట్ చేస్తే భీష్మ అనే కంపెనీ యజమాని పేరు కూడా భీష్మనే.  ఆయనది ఓ పెద్ద అగ్రికల్చర్ బేసెడ్ కంపెనీ. ఆర్గానిక్ వ్యవసాయం కు ప్రాధాన్యత ఇస్తుంటుంది.

 

అదే భీష్మ కంపెనీలో రైవ‌ల్ కంపెనీ కూడా ఉంటుంది. అది పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ దగ్గర తను ఫలానా కంపెనీకు యజమాని అని కమిటవ్వటంతో సూప్ లో పడతాడు హీరో. ఏంచేయాలా అన్న ఆలోచ‌న‌లో ఉండ‌గానే హీరోయిన్ ఆ కంపెనీలో ప‌ని చేస్త‌ద‌ని తెలియ‌డం. త‌ను ఆ కంపెనీలోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచించ‌డం త‌ర్వాత ఓన‌ర్‌ని క‌ల‌వ‌డం ఆయ‌న భీష్మ‌కి హెల్ప్ చెయ్య‌డం. ఆ కంపెనీకి వ‌చ్చే ప్రాబ్ల‌మ్ ఎలా సాల్వ్ చేస్తాడు త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకుంటాడు అన్న‌ది మిగ‌తా క‌థ‌గా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: