దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా బాహుబలి ఫ్రాంచైజీ. బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ అంటూ జక్కన్న తెరకెక్కించిన రెండు భాగాలు టాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాలుగా రికార్డ్స్ ని సృష్ఠించాయి. అంతేకాదు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయో సినిమాని జక్కన్న ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఒక్కసారిగా హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ బాహుబలి సినిమాని చూసి ఉలిక్కి పడేలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సాధించారు జక్కన్న. 

 

ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఒదిగిపోయాడు. ఐదు సంవత్సరాలు ఒకే సినిమా మీద ఉన్న ప్రభాస్ ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ తన సినిమాలన్నింటినీ పాన్ ఇండియా బేస్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. కథ, కథనాల పరంగా యూనివర్సల్ ఆక్సెప్టెన్సీ ఉండేలా దర్శక, రచయితలకి సూచిస్తున్నాడట. అలాంటి కథ అనుకునే సాహో సినిమా చేశాడు. 

 

అయితే ఈ సినిమా బాలీవుడ్ లో తప్ప మిగతా భాషల్లో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ప్రభాస్ లో కోరుకునే అంశాలు చాలా వరకు మిస్ అయ్యాయి. ఆ కారణాలన్నింటిలో చాలా ముఖ్యమైన కారణం మాస్ సినిమా కాకపోవడం. ప్రభాస్ అభిమానులు తమ హీరోని మాస్ సినిమాల్లో చూడడానికే ఇష్టపడతారు. అందుకే మిర్చి, ఛత్రపతి లాంటి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ మాస్ సినిమాలో ఉండే అంశాలు సాహోలో లేకపోవడం కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం అని సినిమా రిలీజైనప్పుడు చెప్పుకున్నాడు.

 

బాహుబలి లాంటి సినిమా తీసిన తర్వాత మిర్చి వంటి మాస్ సినిమా అయితే అభిమానులు థియోటర్స్ లో నానా హంగామా, రచ్చా చేసేవారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నుండి అభిమానులు కోరుకుంటున్నదదే. మరో మిర్చి లాంటి సినిమా లేదా చత్రపతి వంటి సినిమా వస్తే బాగుంటుందని ప్రస్తుతం అనుకుంటున్నారు. మరి తన తర్వాతి సినిమా అయినా మాస్ ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుందో లేదో చూడాలి. ఏదేమైనా ప్రభాస్ ఇప్పటి నుంచి నా అభిమానులు ఎలాంటి అంశాలని ఆశిస్తారో అలాంటి సినిమాలు చేస్తే బెటర్. లేదంటే పాన్ ఇండియా స్టార్ మళ్ళీ నార్మల్ స్టార్ గా అయిపోతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: