బుల్లితెర ఆడియెన్స్ ఇప్పటికే సుడిగాలి సుధీర్ కలిపే బత్తాయి జ్యూస్ గురించి అందరికి తెలిసిందే. సుధీర్, రష్మి మధ్యలో ఆన్ స్క్రీన్ జరిగే రొమాంటిక్ యాంగిల్ ఇప్పటికి హాట్ న్యూస్ అన్నట్టే ఉంటుంది. ఐదారేళ్లుగా రష్మి కోసం సుధీర్ ట్రై చేయడం మనోడిని అసలేమాత్రం పట్టించుకోకుండా ఆమె ప్రవర్తించడం తెలిసిందే. వీళ్లిద్దరు చేసే ఈ ఓవరాక్షన్ కు నిజంగా వీరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందేమో అనుకోవడం ఆడియెన్స్ వంతు అయ్యింది. అయితే తర్వాత తర్వాత వీళ్లది బత్తాయి జ్యూస్ బ్యాచ్ అని తేలింది.

 

ఇప్పటికి రష్మి కోసం సుధీర్ ప్రయత్నించడం ఆమీ తూ.. చీ అని రకరకాల ఎక్స్ ప్రెషన్ పెట్టడం అయినా సరే సుధీర్ వెంటపడటం ఇది చాలా కామన్ అయ్యింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా బుల్లితెర మీద ఓ కొత్త జోడీ పుట్టుకొచ్చింది. హైపర్ ఆది, వర్షిణి ఇద్దరు ఢీ చాంపియన్స్ కు టీం లీడర్స్ గా పనిచేస్తున్నారు. ఈ షోలో ఓ పక్క సుధీర్, రష్మిల రొమాన్స్ హైలెట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొత్తగా ఆది, వర్షిణిల రొమాన్స్ కూడా హాట్ న్యూస్ గా మారింది 

 

సుధీర్ కు ఏమాత్రం తక్కువ కాకుండా వర్షిణితో లవ్వు గివ్వు అంటూ వెంటపడుతూ షో రేటింగ్ కు తన వంతు కృషి చేస్తున్నాడు ఆది. అయితే సుధీర్ అంత సీనియర్ కాకున్నా ఆది కూడా తన ప్రాసలు పంచులతో పాటుగా డ్యాన్స్ లతో కూడా వర్షిణిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరిని చూసిన ఆడియెన్స్ మాత్రం బత్తాయి జ్యూస్ బ్యాచ్ అని ఫిక్స్ అయ్యారు. కేవలం షో రేటింగ్స్ కోసం చీ కొడుతున్నా ఐలవ్యూ అని ఒక అమ్మాయి వెంటపడటం వీరికే చెల్లుతుంది. అయితే ఇది వృత్తిలో ఓ భాగం కాబట్టి నచ్చితే చూడటం లేదంటే ఛానెల్ మార్చడం తప్ప మనమేం చేయలేం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: