ప్రస్తుతం విలక్షణ నటుడు కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే  తాజాగా భారతీయుడు 2 సెట్ లో  భారీ అగ్నిప్రమాదం జరిగింది... అగ్నిప్రమాదంలో ఏకంగా భారతీయుడు అసిస్టెంట్ డైరెక్టర్లు సైతం మృతిచెందారు. కాగా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీ మొత్తం దీనిపైనా  మాట్లాడుకుంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణలో ఇలాంటి ప్రమాదాలు జరగడం అంతా సంచలనంగా మారింది . లైకా ప్రొడక్షన్ హౌస్ కూడా తమకు ఈ బాధ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు లేదంటే సోషల్ మీడియాలో  తెలిపింది . కమలహాసన్ అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి రాత్రి నుంచి అక్కడ పనులు చూసుకున్నారు. 

 

 

 అయితే చిత్ర బృందం లోని ప్రతి ఒక్కరూ ఈ అగ్ని ప్రమాదం పై స్పందించారు కానీ ఈ సినిమా దర్శకుడు శంకర్ మాత్రం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. శంకర్ దగ్గర నుంచి ఒక్క మాట కాని బయటకు రాలేదు. అసలు ఈ ప్రమాదంలో శంకర్ కి  గాయాలయ్యయా  శంకర్ ఎలా ఉన్నాడు... అనే ప్రశ్నతో  అభిమానులు  ఖంగారు పడ్డారు . అయితే తాజాగా ఆయన హాస్పిటల్ కి వచ్చాడు. కమల్ హాసన్ తో పాటు శంకర్  కూడా ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం లో దర్శకుడు శంకర్ కూడా గాయాలయ్యాయి అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఇందులో ఎలాంటి నిజం లేదని సన్నిహితులు  చెప్పుకొచ్చారు. 

 

 

 ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు చనిపోయారని ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారని మాత్రమే మీడియా చెప్పింది కానీ దర్శకుడు శంకర్ ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు అనేది మాత్రం మీడియా ఎక్కడ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయని.. శంకర్ హాస్పిటల్లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అందరి అనుమానాలకు తెరదించుతూ తాజాగా హాస్పిటల్ కి వచ్చి గాయపడ్డ వారిని పరామర్శించారు దర్శకుడు శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: