మొదట ఒక తెలుగు న్యూస్ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా పనిచేసిన శ్రీ రెడ్డి, ఆ తర్వాత అక్కడక్కడ మరి కొన్ని షోల్లో పాల్గొంది. ఇక ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హడావుడి చేసిన శ్రీ రెడ్డి, ఆ ఒక్క ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో పాపులర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను కొందరు మేనేజర్లు వారికి అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, వారిని పలు విధాలుగా లైంగికంగా లొంగ తీసుకుంటున్నారని శ్రీరెడ్డి అప్పట్లో ఆరోపించింది. ఇటువంటి ఘటనలు తనకు కూడా జరిగాయని, అయితే తన లాగా ఏ అమ్మాయి కూడా ధైర్యం చేసి ఇలా మీడియా ముందుకు వచ్చి వాటిని బహిరంగంగా చెప్పలేక పోతుందని, అలా చెబితే తమకు హాని జరుగుతుంది అనే భయం అమ్మాయిలను వెంటాడుతోందని శ్రీరెడ్డి చెప్పడం జరిగింది. 

 

అందుకే ఇకపై టాలీవుడ్ కు వచ్చే అమ్మాయిల భద్రతకు మా అసోసియేషన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ రెడ్డి అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. ఆ తర్వాత దిగి వచ్చిన మా యాజమాన్యం, మొత్తానికి ఆడవారికి ప్రత్యేకంగా విభాగ ఏర్పాటుకు ఒప్పుకుంది. అయితే ఈ విధంగా అందరి లోను ఒకింత మంచి పేరు సంపాదించిన శ్రీ రెడ్డి, ఆపై తెలుగు నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ యొక్క విమర్శలకు, ఆగ్రహావేశాలకు గురైంది. ఇక తర్వాత కొన్నాళ్లకు కొందరు టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ వారి పేర్లు కూడా బయటపెట్టిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వారిపై విమర్శలు చేస్తూనే ఉంది. 

 

ఇక కొద్ది రోజుల క్రితం ఒక ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్న శ్రీ రెడ్డి, పలు రకాల వంటలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక తన ఫేస్ బుక్ లో తాను కూడా ప్రస్తుత హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని ఎప్పటికప్పుడు రకరకాల పోజుల్లో తన సోకు ఆరబోస్తూ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఓవైపు సోకుగా ఫోటోలు దిగి పోస్ట్ చేస్తూ, మరోవైపు పవన్ కళ్యాణ్, నాని వంటి నటులపై నీచమైన ఆరోపణలు చేస్తూ బోకు వేషాలు వేయడమేంటి. చాలు చాలు ఆపు తల్లో నీ విషాలు, అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే తనను ఎవరు ఏమనుకున్నా తను మాత్రం వాస్తవాలు మాత్రమే వెల్లడిస్తానని శ్రీ రెడ్డి చెప్పడం కొసమెరుపు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: