యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఇలియానా. అయితే ఆమె నటించిన తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించింది. ఆపై సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఆమె నటించిన పోకిరి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకొని, ఇలియానాకు ఎంతో పేరుని తెచ్చిపెట్టడంతో పాటు, ఆమె క్రేజ్ ని ఆకాశానికి తీసుకెళ్ళింది. ఇక అక్కడనుండి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు ఆడుకుంటూ ముందుకు సాగిన ఇలియానాకు, కెరీర్ పరంగా మంచి హిట్స్ తో పాటు కొన్ని దారుణమైన పరాజయాలు కూడా ఎదురయ్యాయి. 

 

ఇక రాను రాను కెరీర్ పరంగా ఆమెకు అవకాశాలు తగ్గడం ప్రారంభమైంది. అయితే అదే సమయంలో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసి కొన్నాళ్లు డేటింగ్ చేసి, ఆపై అతడి తో ప్రేమాయణం నడిపిన ఇలియానా, ఆ తర్వాత కొద్దిరోజులకు అతని నుండి విడిపోయింది. ఇక అదే సమయంలో కొన్నాళ్లపాటు మీడియాతో పాటు బయటి ప్రపంచానికి కూడా దూరంగా ఉన్న ఇలియానా, ఇటీవల కొన్నాళ్ల నుండి మళ్లీ తన ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు చేరువ అవడం మొదలెట్టింది. ఇక అదే సమయంలో కొంత బొద్దుగా తయారయినప్పటికీ, ఆమెకు తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా ద్వారా హీరోయిన్ ఛాన్స్ లభించింది. అయితే ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయి, హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు పొందవచ్చు అని ఇలియానా పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. 

 

ఒకప్పటితో పోలిస్తే ఒకింత బొద్దుగా తయారైన ఇలియానా, ప్రస్తుతం అవకాశాల కోసం తన బరువును తగ్గించుకొని శారీరకంగా సన్నగా స్లిమ్ గా తయారవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నట్లు సమాచారం. ఇటీవల తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఇలియానా, ఒకప్పటితో పోలిస్తే కొద్దిగా ఆమె శరీర బరువు తగినట్లుగా అర్థమవుతుంది. ఇక మరింతగా తగ్గి స్లిమ్ గా తయారయ్యేందుకు భోజనం, యోగ, వ్యాయామం విషయంలో కఠినాతి కఠినంగా ఆమె వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బొద్దుగా ఉన్న ఇలియానా, మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ లు దక్కించుకోవడం కోసం ఈ విధంగా పడుతున్న పాట్లు చూస్తుంటే, మా గుండె నిజంగా తరుక్కుపోతోంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: