ఎఫ్ 3 .. అనీల్ రావిపూడి ఎంతో కష్ఠపడి ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకుంటున్నాడు. 2018 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామని అనీల్ రావిపూడి- దిల్ రాజు అప్పట్లోనే ఓపెన్ గా చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 స్క్రిప్టును ప్రిపేర్ చేయడంలో అనీల్ రావిపూడి టీం నానా అవస్థలు పడుతున్నారు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో వెంకీ- వరుణ్ లతో పాటు మూడో హీరో ఉంటారు అన్న ప్రచారం జోరందుకున్నాక ఆ పాత్రకు మాస్ మహారాజా రవితేజను సెలక్ట్ చేసుకున్నారని రూమర్స్ వచ్చాయి.

 

అది కాదంటూ మళ్ళీ అనిల్ రావిపూడి మహేష్ ని ఒప్పించారన్న మ్యాటర్ వైరల్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే సమయంలోనే అనీల్ రావిపూడికి మహేష్ మరో సినిమాని ఆఫర్ చేశారు. అయితే అది సరిలేరు సీక్వెల్ అన్న ప్రచారం సాగుతుండగానే.. అంతకుముందే ఎఫ్2 సీక్వెల్ లో మహేష్ నటిస్తారు అన్న ప్రచారంతో టాలీవుడ్ ని హీటెక్కించారు గాసిప్ రాయుళ్ళు. సూపర్ స్టార్ ఈ సినిమాకి 30 రోజుల కాల్షీట్లు ఇచ్చేశారు.. సెకండాఫ్ లో మాత్రమే ఆయన కనిపిస్తారు! అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. మే 2020 నుంచి ఎఫ్ 3 షూటింగ్ మొదలవుతుందని మళ్ళీ మహేష్ సరసన రష్మిక ఆడి పాడనుందని అన్నారు.

 

అయితే ఇది నిజమా? తన దర్శకుల విషయంలో ఎంతో కమిటెడ్ గా ఉండే మహేష్ తను ప్రకటించినట్టే రావిపూడితో మరో సినిమా చేస్తున్నాడా? ఎఫ్ 3 కి సూపర్ స్టార్ అంగీకరించాడా? లేదూ అవన్నీ గాలి వార్తలా అన్నది తెలీయలేదు. క్లియర్ గా గమనిస్తే ఇప్పటివరకూ ఎఫ్ 2 సీక్వెల్ కి మహేష్ ఓకే చెప్పారని నమ్రత కానీ మహేష్ గాని వెల్లడించలేదు.  వంశీ పైడిపల్లితో మహేష్ 28 సన్నాహలు సాగుతుండగా ఎఫ్ 3 లో మహేష్ నటిస్తారన్నది న్యూస్ మాత్రం జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అనిల్ తో ఇక మహేష్ సినిమా చేయరని సరిలేరుతో అల సినిమా ముందు పరువు తీసేశారని రావిపూడి మీద కామెంట్స్ చేస్తున్నారట. అంతేకాదు అలాంటి క్యారెక్టర్ మహేష్ కి సెట్ కూడా అవదని ఒప్పుకోవద్దని సలహా ఇస్తున్నారట. మొత్తానికి అనిల్ మీద సరిలేరు ఎఫెక్ట్ గట్టిగానే పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: