టాలీవుడ్ హీరోల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు ఆ లిస్ట్ లో టాప్ 3లో ఉన్న యువ హీరో నితిన్ ఫైనల్ గా షాలినితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. 8 ఏళ్లుగా పరిచయంలో ఐదేళ్లు ప్రేమించుకుని సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టాడు. ఏమో అనుకున్నాం కాని నితిన్ కూడా ముదురే అన్న విషయం తన ఐదేళ్ల సీక్రెట్ ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అనుకోక తప్పదు. ఇక బ్యాచ్ లర్ లిస్ట్ నుండి నితిన్ కూడా బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే అందరి వేళ్లు ప్రభాస్, రానా మీదనే చూపిస్తాయి.

 

బాహుబలి టైం లోనే నేడో రేపో పెళ్లంటూ హడావిడి చేసిన ప్రభాస్ బాహుబలి రెండు పార్టులు వచ్చాయి.. ఆ తర్వాత సాహో కూడా వచ్చింది కాని అతని పెళ్లి ముహుర్తం మాత్రం బయటపడలేదు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న జాన్ మూవీ షూటింగ్ పూర్తి చేశాక తప్పకుండా సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి ఈసారైనా అది నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక ఇదే లిస్ట్ లో ఉన్న దగ్గుబాటి వారసుడు రానా కూడా పెళ్లి ఊసే ఎత్తట్లేదు.

 

వీళ్లింకా చిన్న పిల్లలమనే భావనలో ఉన్నట్టు ఉన్నారు. తను చేసే ప్రతి సినిమా హీరోయిన్ తో రానాకు లింక్ పెడతారు. అందుకే రానా కూడా బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పాల్సిందే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ లు కూడా వస్తారు. నితిన్ మ్యారేజ్ ఎనౌన్స్ వల్ల సదరు హీరోల అందరి ఇళ్లల్లో ప్రెజర్ మొదలైందని తెలుస్తుంది. మరి నితిన్ బుక్ అవడం వల్ల ఇంతమందికి హెడేక్ గా మారుతుందని అసలు ఊహించి ఉండరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: