యువ హీరో నితిన్, ఛలో ఫేం వెంకీ కుడుముల కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా భీష్మ. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. కన్నడ నుండి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గానే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు హిట్ అందుకున్న రష్మిక భీష్మతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ యూఎస్ లో వేశారు. ఫస్ట్ హాఫ్ వరకు నితిన్, రష్మిక జోడీ.. వెంకీ మార్క్ ఎంటర్టైనింగ్ తో సినిమా సాగిందట.

 

ఇక సినిమాలో రష్మిక మరోసారి సర్ ప్రైజ్ చేసిందని అంటున్నారు. నిన్న మొన్నటి దాకా మీకర్ధమవుతుందా.. అంటూ ప్రతి ఇంట్లోకి వచ్చి మరి సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు భీష్మ సినిమాలో మరో కొత్త యాంగిల్ లో కనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గ్లామర్ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గిన ఈ అమ్మడు భీష్మలో అది కూడా ఫుల్ ఫిల్ చేసిందని అంటున్నారు. నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందని అంటున్నారు. తన మీద నమ్మకంతో వెంకీ ఇచ్చిన ఆ పాత్రను రష్మిక అదరగొట్టిందట.

 

రష్మిక గ్లామర్ భీష్మ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న రష్మిక ఈ సినిమాతో వాళ్లందరిని అలరిస్తుందట. భీష్మ సినిమాలో రష్మిక రచ్చ రచ్చ చేసిందని తెలుస్తుంది. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ చేసిన ఈ భీష్మ అతనికి మంచి సక్సెస్ ఇచ్చేలా ఉంది. ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండగా సెకండ్ హాఫ్ కూడా పాస్ అయితే సినిమా హిట్ అయినట్టే లెక్క. పోటీగా ఏ సినిమా లేకపోవడం కూడా భీష్మకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: