ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు శివుడు భోళాశంకరుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే భక్తవశంకరుడు. అందుకే సమస్త చరాచర జగత్తుకు శివుడు ని విశ్వనాథుడు గా ఆరాధిస్తారు. పురాణ కాలం కంటే ముందు ఉండే వేదం కాలం నుండి మన భారత దేశంలో ప్రజలు శివారాధన చేసే వారు అన్న ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 8 వేల సంవత్సరాల కాలం నుండి ప్రజలు శివుడు ని ఆరాధించినట్లు చరిత్రకారులు ఆధారాలతో చెపుతున్నారు.


రుగ్వేదంలో శివనామం కనిపిస్తుంది. గ్రీకుల దేవుడు డయోనిసిస్ కు శివుడు కి పోలికలు ఉండటంతో భారతదేశం పై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ ఇక్కడి శివుడు ని చూసి తమ గ్రీకు దేవుడు డయోనిసిస్ గా భావించి పూజలు చేసాడు అని అంటారు. శివుడు ఆరాధన కేవలం మన భారతదేశంలోనే కాకుండా శ్రీలంక కంబోడియా వియత్నాం ఇండోనేషియా లాంటి దేశాలలో కూడ శివారాధన ఇప్పటికీ కనిపిస్తుంది.  


ఓంకారం పలికితే సృష్టిలోని సకల జనుల జన్మ సాకారం అవుతుంది అటువంటి ఓంకారేశ్వరుడే శివుడు. సృష్టి లయకారుడు పరమేశ్వరుడు బోళాశంకరుడు వైద్యనాథుడు విశ్వేశ్వరుడు మల్లికార్జునుడు ఇలా ఎన్నో నామాలతో పరమ శివునికి పదివేల పేర్లు ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. రాగి చెంబుతో కాసిని నీళ్లు పోసి మారేడు దళం లింగం పై ఉంచి కొంచెం భస్మం కనుక శివలింగానికి రాసినట్లయితే ఈశ్వరుడు పొంగిపోతాడు. ఎలాంటి వరాలు అడిగినా ఇస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటాము. ఎన్ని నీళ్లు తనపై పడితే అంత సంతోషిస్తాడు. శివుడు అందుకే గంగమ్మను తలపై పెట్టుకున్నాడు. లయత్వానికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ లయ కర్తలే కోరిన వరాలు తీర్చేవారే పార్వతీ పరమేశ్వరులు. సంయోగమే సర్వసృష్టికి మూలం. మహాశివరాత్రి రోజున వేకువ సమయాన అభిషేకాలు మొదలవుతాయి. ప్రాతఃకాలం నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు జరుగుతుంటాయి. ఇంకొక ముఖ్య విషయమేమిటంటే వైష్ణవ భక్తులకు యజ్ఞోపవీతం ఎంతటి పవిత్రమో శైవ భక్తులకు రుద్రాక్షలు అంతటివి అని చెప్పవచ్చు. పన్నెండు మాస శివరాత్రులలో 11వదైన మాఘమాస శివరాత్రిని మహా శివరాత్రిగా జరుపుకుంటాం.


మన పురాణాలు ఆదియోగి గా శివుడు ని అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముని చేరుకోవాలి అంటే యోగమే తగిన మార్గమని శివారాధన మనకు తెలియచేస్తుంది. ఈరోజు భారతదేశంలోని అన్ని శివాలయాలు శివనామ స్మరణతో హోరెత్తిపోతు శివుడు అందరివాడు అన్న మూల సత్యాన్ని తెలియచేస్తాయి. భౌద్ధ మతం ఆచరించే మహాయాన బౌద్ధులు కూడ ఈరోజు శివుడు ని పూజిస్తారు. ‘శివశివ శంకర’ అంటూ ఈరోజు చేసే శివారాధన మన కోటి జన్మల పాపాన్ని తోలిగిస్తుందని మన నమ్మకం. భవ రోగాలను నయం చేసి ఐశ్వర్య కారకుడుగా అందరికీ వరాలు ఇచ్చే శివ తత్వంలో అనేక నిఘూఢమైన సత్యాలు ఉన్నాయి. ఈరోజు అందరం శివారాధన తో ఆ భోళాశంకరుడు దీవెనలు పొందాలని మనశార కోరుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: