టాలీవుడ్ లో సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య సినిమాలు వస్తున్నాయంటే ఆయన అభిమానులతో పాటు బి, సి సెంటర్లలో బాల‌య్య‌కు ఉన్న క్రేజే వేరు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల రూపాయలు మంచినీళ్లు తాగినంత సులువుగా వసూలు చేస్తుంటే బాలయ్య సినిమాలో మాత్రం గట్టిగా 30 కోట్ల షేర్ కూడా కరెక్ట్ చేయలేకపోతున్నాయి.



బాలయ్య సినిమాలకు ప్లాప్ టాక్‌ రావడం వల్లే కలెక్షన్లు రావడం లేదు అనుకున్న హిట్ టాక్ వచ్చినా.. బాల‌య్య హిట్‌ సినిమాలు సైతం రు. 100 కోట్ల మార్కును ఇప్పటివరకు అందుకోలేదు. పైగా ఇటీవల బాలయ్య నటించిన సినిమాలు అన్ని వ‌రుస పెట్టి అవుతున్నాయి. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలు ప్లాప్ అవ్వ‌గా.. క్రిస్మస్ కానుకగా వచ్చిన యేడాది చివ‌ర్లో వ‌చ్చిన రూల‌ర్ సినిమా సైతం అయింది.



ఇటీవ‌ల‌ బాలయ్య చిత్రాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఈ నెల 26 నుండి షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కొన్ని సన్నివేశాల్లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడట. ఓ ఆధ్యాత్మిక వేత్త‌గా స్టార్ట్ అయ్యే బాల‌య్య పాత్ర ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కు వ‌చ్చే స‌రికి చాలా స‌రికొత్త‌గా ట‌ర్న్ అవుతుంద‌ట‌.



అయితే సినిమాలో మ‌రీ హింస‌, ఫైట్లు లేకుండా ఉండేలా బోయ‌పాటి డిజైన్ చేశాడ‌ట‌. బాల‌య్య గ‌త ప్లాపుల నేప‌థ్యంలో సినిమాలో యాక్షన్ చాల సహజంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు ప్లాప్స్ దెబ్బకి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడ‌నే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: