ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో యువ హీరో నితిన్, రష్మిక లీడ్ రోల్ లో చేసిన సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎస్. నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పూర్తవగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కథ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా రొటీన్ గా అనిపించినా వెంకీ మార్క్ స్క్రీన్ ప్లే, కామెడీ మాత్రం సినిమా ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదని అంటున్నారు.

 

సినిమాలో ఒక సీరియస్ సబ్జెక్ట్ ఓ పక్క నడుస్తున్నా దానితో పాటుగా కామెడీ ఉండేలా చూసుకున్నాడు డైరక్టర్ వెంకీ. తను తీసిన మొదటి సినిమా ఛలో కూడా ఇలానే సక్సెస్ అందుకుంది. నితిన్ భీష్మ కూడా వెంకీ తన మార్క్ చూపించేశాడని తెలుస్తుంది. ఇక నితిన్, రష్మిక జోడీ కూడా చాలా బాగుందట. నితిన్ ఈ సినిమాలో ఎక్కువ ఈజ్ తో నటించినట్టు అంటున్నారు. సినిమాలో నితిన్ డ్యాన్స్ లు కూడా బాగా చేశాడట. లాస్ట్ సాంగ్ వాటే బ్యూటీలో రష్మిక, నితిన్ డ్యాన్స్ అదిరిపోయిందట.

 

ఇక రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటున్నారు. నితిన్ తో రష్మిక జోడీ బాగా కుదిరింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై ఓ పాజిటివ్ బజ్ ఏర్పడగా ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు సాధించిందని తెలుస్తుంది. అయితే కథ రొటీన్ గా అనిపించినా వెంకీ ఎంటర్టైన్ చేసిన విధానం బాగుందని అందుకే బేషుగ్గా ఓసారి చూసే సినిమా భీష్మ అని అంటున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో బొమ్మ పడితే కాని అసలు టాక్ తెలుస్తుంది. నితిన్ మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: