ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీకొచ్చిందంటే నూటికి తొంబై తొమ్మిది శాతం ఆ అమ్మాయిని చీప్ గా చూసే వాళ్ళే ఉంటారు. కళామతల్లి మీద ప్రేమతో కళని నమ్మి మొహానికి మేకప్ వేసుకొని కెమారా ముందుకు వచ్చి నిలుచుంటే ఆ కెమార కళ్ళ కంటే ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్ళ కళ్ళే చాలా నీచంగా చూస్తాయి. ఒకడు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరూ ఇంతే. మేము పొట్ట కూటి కోసం వస్తాము. వాళ్ళు మాలో ఆకలి చూడరు ..అందమే చూస్తారు. వెలి చేష్ఠలు, వంకర మాటలతో హింసపెడతారు. పాపం అనుకునేవాళ్ళు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు అంటూ గత కొంతకాలంగా చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఆవేదన చెందుతున్న సంగతి తెలిసిందే.

 

మంచి నటి. క్యారెక్టర్ ఎలాంటిదైనా చేస్తానంటుంది. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయదు. కానీ వీళ్ళ డిమాండ్ చూస్తేనే ప్రాణం పోయినంత పని అవుతుంది. ప్రతీ ఆఫీసులోను ఒకటే ప్రశ్న. మీకు మంచి క్యారెక్టర్ ఉంది చేస్తారా ..! మీరు ఇండస్ట్రీకి కొత్త కాబట్టి రెమ్యూనరేషన్ ఇవ్వము. షూటింగ్ ఉన్నన్ని రోజులు వేరే సినిమా ఒప్పుకోకూడదు. మాతోనే ఉండాలి. ఇలాంటి మాటలే నటిగా ఆఫీసుకొచ్చిన లేడీ ఆర్టిస్ట్ కి ఎదురయ్యో ప్రశ్నలు. అన్నిటికి సరే అనాలి. అక్కడిదాకా బాగానే ఉంది.

 

రెండు రోజుల్లో షూటింగ్. మేము చెప్తాము. కాని సాయత్రం ఒకసారి కాల్ చేసి గెస్ట్ హౌజ్ కి రండి. ఈ మాటే ఆ నటికి గుండె పగిలింత పని చేస్తుంది. సాయత్రం 7 తర్వాత,  8 తర్వాత .. రండి. ఒక్కరే రావాలి ఎవరిని తీసుకు రావద్దు. ఇలాంటి మాటలు అంటున్నంత సేపు ఆ నటికి అవతలి వాడి కుక్క బుద్ధి ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఒకడు కాదు ఇద్దరు కాదు ప్రతీ చోటా పదుల్లోనే ఉంటారు. ఇండస్ట్రీ చాలా పెద్దది. ఎవరికైనా వేశం ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటారని ఆశగా వస్తే వాళ్ళు కోరుకునేది ముందు పడక గదిలో పక్క సుఖాన్ని.  

 

ఎంతో మంది ఇలాంటివి అనుభవిస్తున్నారు. కానీ ఒళ్ళు అమ్ముకోలేక ఆత్మాభిమానం చంపుకోలేక కొంతమంది మాత్రం కుమిలి చస్తున్నారు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన నటి ఈ బాధలు పడలేక సినిమాలు వద్దనుకొని సీరియల్స్ వైపు వస్తే అక్కడా ఇదే అనుభం ఎదురైంది. ఇప్పటికి చిన్న క్యారెక్టర్ దక్కించుకోవాలన్న ఆ ఒక్క మాట వినాలి. లేదంటే మళ్ళీ కాల్ చేస్తాము వెళ్ళండి. ఇక అంతే. దీంతో ఆ నటి విసిగిపోయి చిత్త కార్తెల్లో కుక్కలురా మీరు అంటూ అవేదన వ్యక్తం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: