తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా, ఏ మ్యూజిక్ ఛానెల్ చూసినా ఒకే పాట హోరెత్తుతోంది. అదే "'సామజవరగమన' ..." ఇప్పటికే చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది ,అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది... కానీ చాలా మందికి "సామజవరగమన" అంటే ఏంటో తెలీదు...మరి మీకు అసలు "సామజవరగమన" ఎవరో మీకు తెలుసా?

 

 

'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది... 'సామజ' అనగా "ఏనుగు" అని అర్థం..'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం...అలానే ఈ సామవేదం అనగా సంగీతం.. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం. "సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా,ఠీవి నడిచేవారు అని అర్థం..

 

 

మరి అసలైన "సామజవరగమన" ఎవరో తెలుసా??... అసలైన "సామజవరగమన.. "శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు.." వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డంటారు...అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు వారు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు..

 

చాలా మంది "సామజవరగమన" అంటూ పాడేస్తున్నారు....కానీ పాపం వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు.. దాని అర్థం ఏంటో తెలీదు...వారికి చెప్పేందుకైనా "సామజవరగమన" కీర్తన ,దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం..

 

సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥ సామజ॥

సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ!

వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!

గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥

 

 

కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది... కీర్తన అర్థం... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..

 

సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..

ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: