ఓటమి లేని జట్టుగా... ప్రత్యర్దులందరినీ చిత్తు చేస్తూ... వరుస సిరీస్ లను  గెలుచుకుంటూ... తమ జట్టు కు ఎదురు లేదు అని నిరూపించుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ పర్యటనలో ఎదురు దెబ్బ తగిలిన  విషయం తెలిసిందే. మొదట అద్భుత ప్రదర్శన చేసి టి20 సిరీస్ ను క్లీన్ స్విఫ్ చేసింది టీమిండియా. దీంతో సంచలన విజయంతో పాటు ఎన్నో సంచలన రికార్డులను కూడా నెలకొల్పింది టీమిండియా. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్లో మాత్రం టీమిండియా సత్తా చాటలేకపోయింది అనే  చెప్పాలి. సొంతగడ్డపై క్లీన్స్వీప్ ఆయన ప్రతీకారాన్ని న్యూజిలాండ్ జట్టు తీర్చుకుంది. వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్  కూడా గెలవలేక సిరీస్ ను  కివీస్ జట్టుకు  అప్పజెప్పింది ఇండియా. ఇక నేటి నుంచి న్యూజిలాండ్ టీమిండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. కాగా ప్రస్తుతం ఈ సిరీస్పై అందరి కళ్లు ఉన్నాయి. 

 

 

 అయితే వన్డేల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి భారత జట్టు పాఠాలు నేర్చుకున్న టు కనిపించడం లేదు. రెండు టెస్టు సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ లోని బేసిస్ రిజర్వు మైదానంలో తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు క్రమక్రమంగా కష్టాల వైపు జారుకుంటుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు... మొదట టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన ఓపెనర్లు మరోసారి పేలవ ప్రదర్శన చేశారు అని చెప్పాలి. కేవలం 40 పరుగులకే మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది టీమిండియా. 

 

 

 ఈ నేపథ్యంలో టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో కి వెళ్ళిపోతుంది. ఓపెనర్ పృద్వి షా  మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ పూజారా 11 పరుగులతో వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ పై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ కోహ్లీ కూడా కేవలం 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. గ్రీసు లోకి వచ్చినట్లే వచ్చి వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 49 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: