నితిన్ సినిమా తెర పై కి వచ్చేసింది. ఇన్నాళ్ళ కష్టానికి ప్రతి ఫలం ఎలా ఉందో మరి. అయితే కామిడీ తో సినిమా ని పిచ్చి ఎక్కించాడు అన్నది స్పష్టం అవుతున్న విషయమే. బొమ్మ హిట్ అంటూ ఇప్పటికే గోల వినిపిస్తోంది. అయితే చాలా కాలం నుండి పరితపిస్తున్న హిట్ కోసం నితిన్ ఎంతో కష్ట పడుతున్నాడు.
 
 
అయితే నిజం గా ఈ సినిమా తో ఓ మంచి హిట్ దొరికింది అనే చెప్పాలి. ప్రేక్షకులు ఇప్పటికే పాజిటివ్ గా సినిమా పై టాక్. అదీ కాకుండా మంచి టైమింగ్ లో మంచి కామిడీ తో కేక అనిపించు కుంటున్నాడు మన హీరో నితిన్.హీరో నితిన్, హీరోయిన్ రష్మికా ఇరువురూ కలిసి జంటగా నటించిన సినిమా. సింగిల ఏంతం కూడా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆ టీజర్, ఆ ట్రైలర్ కూడా బొమ్మ హిట్ అన్నట్లు ఉన్నాయి కదా.
 
 
ఇక పోతే సినిమా లో హైలైట్ ఆ కామిడీ నే ఆ డైలాగ్స్ అబ్బో ఎంతో ఆసక్తి గా కడుపారా నవ్వించాయిట. ఈ సినిమా కి వెంకి కుడుముల దర్శకత్వం వహించారు. అప్పుడు వచ్చిన ఛలో లో ఓ మంచి కామిడీ ని పండించి కడుపుబ్బా నవ్వించారు. మళ్ళీ అదే సీక్వెన్స్ తో అదే జోష్ తో స్క్రీన్ పై కి తీసుకుని వచ్చాడు ఈ డైరెక్టర్.
 
 
అయితే నిజం గా ఛలో కంటే కూడా బాగుటుంది అని అంటున్నారు చిత్ర యూనిట్. అంతే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ గారు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఆల్రెడీ అమెరికా లో ఈ చిత్రం విడుదల అయ్యింది. అక్కడి వారు వారి అభిప్రాయాలని ట్వీట్ చేస్తున్నారు ట్విట్టర్ లో
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: