టాలీవుడ్ హీరో నితిన్, చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ వస్తున్న భీష్మ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ప్రస్తుతానికి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ బాగా వినిపిస్తోంది. కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన నితిన్ సరసన నటించి తెరపైన ఒక మ్యాజిక్ చేసింది అని చెప్పుకోవచ్చు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో ముఖ్యంగా వెన్నెల కిషోర్, రఘుబాబు పండించిన కామెడీ అదిరిపోయిందని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.




నితిన్ సినిమా కెరియర్ లోనే ఈ సినిమాలోని పాత్ర మోస్ట్ ఎంటర్టైనింగ్ గా ఉందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నిర్మాత నాగ వంశీకి భీష్మ సినిమా కొన్ని కోట్ల లాభాలు తెచ్చిపెడుతుందని ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడు జిషుసేన్ కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పాటలు బాగున్నాయి కానీ చాలా తక్కువ వ్యవధితో ఉన్నాయి. అయినను కథ ఎఫెక్టివ్ గా చెప్పేందుకు ఇలా చేశారని తెలుస్తుంది. రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ వెంకీ కుడుముల బ్రహ్మాండంగా కథలో హాస్యం పండించి సూపర్ డూపర్ గా వెండితెరపై చూపించేసాడు.




ఇక సినిమాలో కాస్త ల్యాగ్ ఉన్నపటికీ కామెడీ వలన అంతగా చెడు టాక్ యాక్టర్ దీనికి వినిపించడం లేదు. కథ విషయానికి వస్తే వ్యవసాయ రంగానికి చెందిన భీష్మ ఆర్గానిక్ కంపెనీని కొన్ని కారణాల వలన భీష్మ(నితిన్) చేపట్టవలసి వస్తుంది. కానీ మరో కార్పొరేట్ కంపెనీ అధినేత రాఘవన్(జిష్షు) భీష్మ ఆర్గానిక్ కంపెనీని ఆపాలని చేస్తుంటాడు. మరోవైపు భీష్మ తన లైఫ్ బోరింగ్ గా ఉందని రష్మిక వెంటపడతాడు. ఆ తర్వాత రష్మిక తో కెమిస్ట్రీ, విలన్ తో వైరం పెరగడమే ఈ సినిమా యొక్క సారాంశం. ఏదేమైనా ఎన్నో సంవత్సరాల తర్వాత సినిమా తీసిన నితిన్ తన స్మార్ట్ లుక్స్ తో, కామెడీతో హిట్టు కొట్టడానికి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మా రేటింగ్ 3.5/5.

మరింత సమాచారం తెలుసుకోండి: