ఇప్పటికే క్రికెట్ టీమ్ మెంబెర్స్ సంఖ్యకు దగ్గరగా చేరిపోయిన మెగా హీరోల లిస్టులో మెగా స్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ చేరిపోయినా అతడికి ఏమాత్రం గుర్తింపు లభించడం లేదు. దీనికితోడు అతడు నటించిన మొదటి సినిమా ‘విజేత’ ఘోరమైన ఫ్లాప్ గా మారిపోవడంతో పాటు అతడి మొదటి సినిమా ‘విజేత’ కు కనీస ఓపెనింగ్స్ కూడ రాకపోవడంతో మెగా అభిమానులు కూడ చిరంజీవి చిన్న అల్లుడిని పట్టింకోలేదా అన్న సందేహాలు వచ్చాయి.


ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి తన అల్లుడు కొత్త సినిమా కోసం చాల పాట్లు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రీన్ ప్లే డైలాగ్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి పనిని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడట. ‘విజేత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్సినిమా ఫెయిల్యూర్ తో నిరాశపడిపోయి అమెరికా వెళ్ళిపోయాడు.


అయితే తన చిన్నల్లుడి నిరాశను తొలగించాలని స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి అనేక కథలు విన్న తరువాత ‘సూపర్ మచ్చి’ అనే కథను ఓకే చేశాడు. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ కథ వినడానికి బాగుంది కానీ ఈ మూవీ మేకింగ్ మాత్రం చాల నాసిరకంగా తయారైందని వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి ఈ మూవీ నిర్మాత రిజ్వాన్ కు పెద్దగా అనుభవం లేకపోవడంతో ఈ మూవీ దర్శకుడు  పులివాసు తీసిన సీన్స్ మరీ భయంకరంగా తయారు అయ్యాయని వార్తలు వస్తున్నాయి. దీనితో రంగంలోకి దిగిన చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు తీసిన సీన్స్ అన్నీ చూసి ఆ సీన్స్ అన్నీ పక్కకు పెట్టమని సలహా ఇవ్వడమే కాకుండా ఈ మూవీ కథ విషయంలో పరుచూరి బ్రదర్స్ సహకారంతో పూర్తి మార్పులు చేర్పులు చిరంజీవి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ నిర్మాతకు ఆర్ధిక భారం పెరిగి పోవడంతో ఈ విషయాల పై చిరంజీవిమూవీ నిర్మాతకు భరోసా ఇచ్చినట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: