దాదాపు మూడేళ్ల తరువాత నితిన్‌ ఖాతాలో మరో హిట్ పడింది. ఏడాది విరామం తరువాత వెండితెర మీద కనిపించిన యంగ్ హీరో నితిన్‌ సాలిడ్‌ సక్సెస్‌ తో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో సూపర్బ్‌ అనిపించాడు. రొటీన్‌ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా కామెడీతో మెప్పించి హిట్ లిస్ట్‌లోకి చేరిపోయాడు. యంగ్ హీరో నితిన్‌, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన తాజా చిత్రం భీష్మ. నితిన్ దాదాపు ఏడాది విరామం తరువాత చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్‌ గత మూడు చిత్రాలు ఫెయిల్ కావటంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టు గా మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


నితిన్‌ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుములు. భారీ ట్విస్ట్ లు, టర్న్‌ లు లేకుండా ఓ కూల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ మీద వర్క్‌ చేసిన వెంకీ, నితిన్‌ను దిల్ సినిమా టైంలో ఉన్నంత ఎనర్జీ తో చూపించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందంటున్నారు ఆడియన్స్‌. కథ పెద్దగా లేకపోయినా కామెడీ మాత్రం సూపర్బ్ అంటున్నారు ఆడియన్స్‌. 

 

కామెడీతో పాటు నితిన్‌, రష్మికల కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మహేష్ బాబు లాంటి సూపర్‌ స్టార్‌ తో సినిమా తరువాత మీడియం రేంజ్‌ హీరోలతో చేస్తుందా అన్న అనుమానాలకు చెక్‌ పెడుతూ నితిన్‌ సరసన జోడి కట్టింది రష్మిక. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ కోసం ఈ సినిమా చేసింది. తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. ఓవరాల్‌గా నితిన్‌, రష్మికల భీష్మ సూపర్‌ హిట్ దిశగా దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: