సాధారణంగా నితిన్ సినిమాలు అంటే గతంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు గాని ఇష్క్ సినిమా తర్వాత అతను రూటు మార్చడం తో ఓకే పర్వాలేదు చూడవచ్చు, అనుకునే స్టేజ్ కి ప్రేక్షకులు వెళ్ళారు. అఆ తర్వాత నితిన్ సినిమా కోసం ఎదురు చూసే వరకు వెళ్ళారు. ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాపులు చూసినా నితిన్ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇక అతను సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో మాదిరిగా ఎలా పడితే అలా చేయడం లేదు. 

 

ఈ నేపధ్యంలోనే తాజాగా వచ్చిన భీష్మ సినిమా పై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలను ఈ సినిమా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో చిన్న చిన్న మైనస్ లు ఉన్నా ఆకట్టుకుంది అంటున్నారు. కామెడికి ఎక్కువ గా దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడు అనే టాక్ వినపడుతుంది. అయినా సరే సినిమాను బోర్ కొట్టించలేదు అంటున్నారు. ఇక సినిమాలో కొన్ని సీన్లు కాస్త ఓవర్ గా, లాజిక్ లేకుండా అనిపించినా ఓకే ఫైన్ అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ఫైట్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది అంటున్నారు. 

 

అలాగే హీరోయిన్ పాత్రను మరీ ఒక యాంగిల్ లో చూపించకుండా కాస్త మార్చి ఉంటే బాగుండేది అంటున్నారు. వాస్తవానికి రష్మిక లాంటి హీరోయిన్ కి ఎలాంటి పాత్ర ఇస్తే అలాగే గాని వైవిధ్యం మాత్రం ఎక్కడా ఉండదు. అలాంటి హీరోయిన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అంటున్నారు. సెకండ్ ఆఫ్ కాస్త స్లో గా ఉంది అంటున్నారు. సినిమాలో సాంగ్ ఒక్కటి మినహా ఏదీ ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా రేంజ్ పెరిగి ఉండేది అంటున్నారు ఫాన్స్. ఏది ఎలా ఉన్నా చిన్న చిన్న మైనస్ లు ఉన్నా ఓవర్ ఆల్ గా చూస్తే సినిమా ఎబో యావరేజ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: