లవర్ బోయ్ నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీష్మ. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ సెకండ్ మూవీగా చేసిన ఈ భీష్మ సినిమాపై కూడా రిలీజ్ ముందే సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ తో భీష్మ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. వెంకీ మార్క్ ఎంటర్టైనర్ గా ఈ మూవీలో లీడ్ పెయిర్ అదరగొట్టేశారని తెలుస్తుంది. నితిన్, రష్మిక ఇద్దరు జోడీగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య సూపర్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినట్టు చెబుతున్నారు.

 

సినిమాలో కథ మాములుగా ఉన్నా డైరక్టర్ తన కామెడీ టాలెంట్ తో మెప్పించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ టైమింగ్ ను బాగా వాడేసుకున్నట్టు టాక్ వస్తుంది. నితిన్ లో ఉన్న ఆ టైమింగ్ ను బాగా వాడేసుకున్నాడట. వరుస సినిమాలతో ఫుల్ ఫాం లో ఉన్న రష్మిక కూడా భీష్మలో తన మార్క్ చూపించినట్టు తెలుస్తుంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫ్యాన్స్ ను అలరిచిందని అంటున్నారు. తప్పకుండా సినిమాకు రష్మిక ప్లస్ అయ్యిందని చెబుతున్నారు.

 

ఒక సినిమా హిట్ అవడంలో లీడ్ పెయిర్ చాలా ప్రాధాన్యత వహిస్తారు. ఈ విషయంలో నితిన్, రష్మిక చించేశారని తెలుస్తుంది. ఇద్దరి పాత్రలకు ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారట. ఇక ఈ సినిమాలో స్పెషల్ గా నితిన్, రష్మిక ఒకరిని మెంచి డ్యాన్స్ అదరగొట్టారట. కొన్నాళ్లుగా డ్యాన్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని నితిన్ ఈ సినిమాలో అన్ని ప్యాకేజులు కలిపి కొట్టినట్టు తెలుస్తుంది. సో నితిన్ కు భీష్మ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఉందని టాక్. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై సూపర్ హిట్ టాక్ వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: