ఏ మాటకు ఆ మాట గాని మన తెలుగులో సినిమాల మీద జనానికి పిచ్చి ఎక్కువగానే ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా విడుదల అవుతుంది అంటే చాలు హాల్ కి వెళ్ళిపోతారు చాలా మంది. వినోదం అంటే మన వాళ్లకు సినిమానే. తమిళంలో కూడా అలాగే ఉంటుంది లే గాని మన తెలుగులో ఆ పాళ్ళు కాస్త ఎక్కువ. సినిమాను సినిమాగా కూడా చూడరు. చూసిన కాసేపు కూడా అలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. 

 

సినిమా వసూళ్ళ మీద ఈ ప్రభావం కాస్త ఎక్కువగానే పడుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా లాస్ లో ఉండటానికి, జాను, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు రాడ్డు సినిమాలు అని టాక్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం నోటి ప్రచారమే. వసూళ్ళ మీద ఆ ప్రభావం ఎక్కువగానే పడింది. అది పక్కన పెడితే సంక్రాంతి తర్వాత ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేదు అనే చెప్పాలి. సినిమా కొనుక్కున్న వాళ్ళు థియేటర్ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చుని చూసారు. 

 

అయితే ఇప్పుడు నితిన్ నటించిన భీష్మ సినిమా మాత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా మీద ఇప్పటి వరకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే సినిమా వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు. నితిన్ రేంజ్ 50, 60 కోట్లకు సినిమా వెళ్ళే ఛాన్స్ ఉందని, వరుస ఫ్లాపులతో ఉన్న టాలీవుడ్ ని ఈ సినిమా గట్టెక్కించడం ఖాయమని అంటున్నారు అభిమానులు. చిన్న సినిమాలను కొనే వాళ్లకు ఈ సినిమా కాస్త ధైర్యం ఇస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా 15 కోట్ల వసూళ్లు దాటలేదు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: