యంగ్ హీరో నితిన్ న‌టించిన భీష్మ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాపై ముందు నుంచే పాజిటివ్ బ‌జ్ ఉంది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరో నితిన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా భీష్మ. లై, శ్రీనివాస కళ్యాణం ఇలా వ‌రుస ప్లాపుల తర్వాత చేస్తున్న ఈ సినిమాపై నితిన్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఛ‌లో ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

 

తొలి రోజు తొలి ఆట‌కే సినిమాకు అదిరింద‌న్న టాక్ వ‌చ్చేసింది. సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్‌, కామెడీ... పాట‌లు. బీజీఎం అన్ని హైలెట్ అయ్యాయి. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్‌ అయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా కు యునానిమ‌స్ హిట్ టాక్ వ‌స్తోంది.

 

సినిమా పై ఎవ్వ‌రూ నెగిటివ్‌గా స్పందించ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రు నితిన్‌కు చాలా రోజుల త‌ర్వాత సూప‌ర్ హిట్ వ‌చ్చిందంటున్నారు. సినిమా ఫ‌స్టాఫ్ ఏదో అలా సాగినట్టు అనిపిస్తుంది.మరీ గొప్పగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ప్రతీ ఆర్టిస్టు మంచి నటనతో అలాగే ఆలోచింపజేసే కథనంతో మెల్లగా కొనసాగుతుంది. ఇక ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల నితిన్‌లో స‌రికొత్త యాంగిల్‌ను ఈ సినిమాతో ప్ర‌జెంట్ చేశాడ‌ని అంటున్నారు.

 

ఏదేమైనా అటు నితిన్ పెళ్లి త్వ‌ర‌లోనే ఉండ‌డం.. ఇటు చాలా రోజుల త‌ర్వాత నితిన్‌కు అదిరిపోయే టాక్‌తో బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో సోష‌ల్ మీడియాలో భీష్మ సినిమా జోరుగా వైర‌ల్ అవుతోంది.  అటు నితిన్ అబిమానులతో పాటు తెలుగు సీనీ ప్రియులు అంద‌రూ నితిన్‌కు ముందుగానే పెళ్లి శుభాకాంక్ష‌లు చెపుతూ భీష్మ టాక్ ను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: