యంగ్ హీరో నితిన్ కెరీర్ కొద్ది రోజులుగా వ‌డిదుడుకుల ప్ర‌యాణం అన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టించి అ...ఆ సినిమా త‌ర్వాత నితిన్ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ హిట్ లేదు. మ‌ధ్య‌లో వ‌చ్చిన లై, శ్రీనివాస క‌ళ్యాణం లాంటి సినిమాలు కూడా అంచ‌నాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు నితిన్ - వెంకీ కుడుముల కాంబినేష‌న్లో తెర‌కెక్కిన భీష్మ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే మంచి అంచ‌నాలు ఉన్నాయి.

 

ఇక ఓవ‌ర్సీస్‌లో సినిమా చూసిన వారంద‌రు సినిమాకు 3, 3.25, 3.5 రేటింగులే ఇస్తున్నారు. దీనిని బ‌ట్టి సినిమా ఎంత సూప‌ర్ టాక్‌తో స్టార్ట్ అయ్యిందో క్లీయ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ఇక కామెడీ అదిరిపోయింద‌ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. కామెడీ టైమింగ్ ఏ సీన్లో ఎలా పండాలో ఖ‌చ్చితంగా అలాగే ప‌డింద‌ని అంటున్నారు. ఇక స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని అంటున్నారు.

 

ఓవ‌రాల్‌గా బాక్సాఫీస్ వార్‌లో ఈ సినిమా ఖచ్చితంగా విజేత‌గా నిలుస్తుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అదే టైంలో మ‌రో వైపు నితిన్ పెళ్లి ఫిక్స్ అవ్వ‌డంతో పాటు ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ కూడా జ‌ర‌గ‌డంతో ఇక భీష్మ హిట్‌తోనే నితిన్‌లో పెళ్లి క‌ళ వ‌చ్చేసింద‌ని.. నితిన్ పెళ్లి సంబ‌రాలు అప్పుడే ప్రారంభ మ‌య్యాయ‌ని కూడా కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో నితిన్‌, వెంకీ కుడుముల క్రేజ్ పెరిగింది.

 

అదే టైంలో ఈ సంక్రాంతికి మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన ర‌ష్మిక మంద‌న్న ఛ‌లో సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ర‌ష్మిక క్రేజ్ టాలీవుడ్‌లో మూడింత‌లు పెరిగిన‌ట్ల‌య్యింది. ఇక ర‌ష్మిక జోరుకు బ్రేకులు వేయండం ఇప్ప‌ట్లో ఏ హీరోయిన్ వ‌ల్ల అయ్యేలా లేదు. ప‌లువురు స్టార్ హీరోలు సైతం ర‌ష్మిక‌ను త‌మ సినిమాల్లో పెట్టుకునేందుకు ఇక క్యూలోనే ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: