తెలుగు లో వస్తున్న కామెడీ షోస్ లో బాగా పాపులర్ అయ్యింది ‘జబర్ధస్ద్’ .  ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన జబర్ధస్త్ ఇప్పటికీ కొత్తదనంతో కొనసాగుతున్నట్లే ఉంటుంది.  ఎప్పటికప్పుడు ఇక్కడ నటులు తమ కొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు.  అయితే జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.  వీరి స్కిట్స్ వస్తే పొట్టచెక్కలయ్యేలా ఉంటాయి. ఇక హైపర్ ఆది విషయానికి వస్తే పంచ్ డైలాగ్స్ పేలిపోతుంటాయి. అయితే బజర్ధస్త్ వచ్చిన పాపులారిటీతో సుడిగాలి సుధీర్ ఇతర ఛానల్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. 

 

 ఢీ లాంటి కార్యక్రమాల్లో టీం లీడర్ గా తనదైన ముద్ర వేసాడు.  బుల్లితెరపై బాగానే ఆకట్టుకున్నా.. వెండి తెరపై మాత్రం డిజాస్టర్ అయ్యాడు. ఐతే... సుడిగాలి సుధీర్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా రష్మీతో  సుధీర్ కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. వీరి గురించి కథలు కథలు గా చెప్పుకుంటారు.  స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరి జంట సూపర్ హిట్ అయింది. వీరిద్దరు కలిసి చేసిన డాన్స్ లు, ఫెస్టివల్ స్పెషల్ కార్యక్రమాలు దాదాపుగా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సుడిగాలి సుధీర్‌ విషయం అలా ఉంచితే ఈ మద్య హైపర్ ఆది కూడా వెండితెరపై కనిపిస్తున్నాడు. బుల్లితెరపై ఇతర కార్యక్రమాల్లో కూడా దూసుకు పోతున్నాడు. 

 

ఇప్పుడు  ఢీ షోలో సుధీర్-రష్మి జంట టీం లీడర్లుగా ఉంటే... మరో టీం లీడర్లుగా హైపర్ ఆది-వర్షిణి టీం లీడర్లుగా ఉన్నారు. ఇన్నాళ్లు పంచ్ డైలాగ్ లకే పరిమితమైన ఆది ఈ మధ్య సుధీర్ మాదిరిగా లవర్ బాయ్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా హైపర్ ఆది, వర్షిణి తో కలిసి ఢీ వేదిక పై  ఓ రొమాంటిక్ సాంగ్ లో వేసిన చిందులు చూసి ఆడియన్స్‌తో పాటు జడ్జెస్ కూడా షాక్ తిన్నారు.  మొత్తానికి సుధీర్ ని ఆది బాగానే డామినేట్ చేసేలా ఉన్నాడే అన్న టాక్ వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: