యంగ్ హీరో నితిన్ భీష్మ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. పాజిటివ్ టాక్ మ‌ధ్య ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓవ‌ర్సీస్లో ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో సంబ‌రాలు మామూలుగా లేవు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు దర్శకుడు వెంకీ కుడుముల ఎక్కడా ఎంటర్టైన్మెంట్ గ్రాఫ్ తప్పకుండా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ... రష్మిక - నితిన్ రొమాంటిక్ ట్రాక్‌ బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకోవడంలో స‌క్సెస్ అయ్యాడ‌ని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

 

ఇక వెంకీ రాసుకున్న సీన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి కానీ ఎప్పటిలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి తేల్చేసాడు. కథలో హీరో – విలన్ కి గట్టి పోటా పోటీ సీన్స్ పెట్టే ఆస్కారం ఉన్నా ఆ ట్రాక్ మ‌రింత స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకుని ఉండి ఉంటే సినిమా రేంజ్ మ‌రింతగా ఎక్క‌డికో వెళ్లి పోయేద‌ని అంటున్నారు. ఇక వెంకీ కుడుముల తీసుకున్న కథ చాలా సింపుల్ అయినప్పటికీ తన మార్క్ కామెడీ, లవ్ సీన్స్, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించి చాలా మంది దాటలేని ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటేశాడు.

 

ఇక సినిమా చూసిన వాళ్లు అంద‌రూ సినిమాకు 3.25 రేటింగ్‌కు త‌క్కువ ఇవ్వ‌డం లేదు. సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో నితిన్ న‌ట‌న పొగ‌డడంతో పాటు, అటు ర‌ష్మిక క్యూట్ ఎక్ర్‌ప్రెష‌న్స్‌ను ప‌లువురు తెగ మెచ్చేసుకుంటున్నారు. ఇక భీష్మ రేటింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. అస‌లు 3 రేటింగ్ అనే మాట కూడా ఎవ్వ‌రూ మాట్లాడ‌డం లేదు.. భీష్మ‌కు 3.25 అంత‌కు మించిన రేటింగ్ ఇస్తున్నారు. దీనిని బ‌ట్టి భీష్మ సినిమా స్టార్టింగ్‌లోనే ఈ రేంజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంటే ఇక ఏ రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు వెళుతుందో ?  ఊహించుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: