నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ సినిమా ఈరోజు అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా స్టోరీ అద్భుతంగా ఉంది అని.. డైలాగులు.. కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.. ప్రేక్షకులు.      

 

ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ సూపర్ అని.. రష్మిక నితిన్ సరసన అద్భుతంగా సెట్ అయ్యింది అని.. స్టోరీ సూపర్ అని.. అప్పట్లో త్రివిక్రమ్ అ.. ఆ సినిమా కంటే ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక పోతే నితిన్ కి ఈ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది అనే చెప్పాలి.             

 

అయితే ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఈ భీష్మ చిత్రం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఎంత అద్భుతంగా ఉంది అంటే? చాలా కామెడీ కామెడీగా సినిమా అధిరిపాయింది. అలాంటి ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక తన ఓవర్ యాక్షన్ మాములుగా లేదు.. ఆ వీడియో చూస్తే అబ్బో మాములు యాక్షన్ కాదుగా అని అనాల్సిందే. 

 

అలా ఉంది ఆమె యాక్షన్.. ఇక సినిమాలో కూడా ఆమె ఎంత మంచి నటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన నటనతో పాత్రలో లీనం అయిపోతుంది. అయితే అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ నటి. కాగా గత నెలలో సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబుతో కలిసి వచ్చిన ఈ భామ ఈ నెల నితిన్ సరసన వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. మరి నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుందో.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: