సినీ పరిశ్రమలో కొనసాగాలంటే నిత్యం శ్రమించాల్సిందే. క్రియేటివిటీ థాట్స్ తో సినిమాలు తీస్తూ హిట్లు తీస్తూ కెరీర్ నిలుపుకోవాలి. ముఖ్యంగా సినిమా దర్శకులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సవాల్ గా మారింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి. తొలి చిత్ర అవకాశాన్ని మలి చిత్రం వరకూ నిలుపుకోవాలంటే హిట్ తప్పనిసరి. ఇక్కడే వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడు. రెండేళ్ల క్రితం ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు రెండో అవకాశాన్ని పట్టేశాడు. నితిన్ తో భీష్మ సినిమాను తీశాడు.

 

 

ఈ రోజు విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే సూపర్ హిట్ తెచ్చుకుంది. పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా, మంచి స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుంటోందనే టాక్ వస్తోంది. ఫుల్ ఫన్ అండ్ కామెడీ సినిమాగా ఉందనే మౌత్ టాక్ కూడా వస్తోంది. దీంతో వెంకీ కుడుముల వరుసగా రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఎంతోమంది సక్సెస్ ఫుల్ దర్శకులకు టలీవుడ్ లో ద్వితీయ విఘ్నం తప్పలేదు. మొదటి సినిమాతో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ రెండో సినిమాతో నిలుపుకోలేక చతికిలపడ్డారు. రెండో సినిమాతో కూడా హిట్ కొట్టిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, బోయపాటి శీను.. వంటి దర్శకుల పక్కన వెంకీ కుడుముల చేరిపోయాడు.

 

 

భీష్మ మూవీ ఛలోను మించి హిట్ సాధిస్తుందని అప్పుడే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా తీయడంలో వెంకీ ఎక్కడా తడబడలేదని అంటున్నారు. సినిమాను ఆసక్తిగా నడిపించడంలో, కామెడీ లో వెంకీ తన మార్క్ చూపాడని అంటున్నారు. త్రివిక్రమ్ శిష్యుడు కూడా కావడంతో రాతలో తీతలో అనుభవం సంపాదించి గురువు పేరు నిలబెట్టాడనే అంటున్నారు. ఈ వీకెండ్ మొత్తం భీష్మ హవాతో నితిన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: