పవర్ఫుల్ హీరోయిజానికి మారుపేరు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా వరుస ప్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ఫేవరెట్ అండ్ హిట్  కాంబినేషన్ అయినా బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇక మరోవైపు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా తనకు బ్లాక్బస్టర్ ఇచ్చిన హీరో బాలకృష్ణ కోసం ఒక మంచి కథను రెడీ చేసుకున్నారు. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా... త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు బోయపాటి బాలకృష్ణ పాత్రను ఎంతో కొత్తగా డిజైన్ చేశారని... ఈ సినిమాలో బాలకృష్ణ ఇప్పటివరకు కనిపించనంత సరికొత్తగా కనిపించబోతున్నారు అంటూ ఫిల్మ్ వర్గాల్లో  లో టాక్ నడుస్తుంది విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించేందుకు ఇద్దరు కథానాయకులు ఎంపిక చేశారని... వీరిలో ఒకరు నయనతార మరొకరు  శ్రీయ  అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా అవాస్తవం అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం నయనతార ను సంప్రదిస్తే డేట్స్ ఖాళీ లేనందున ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.ఇక శ్రీయ  కూడా అంతగా ఆసక్తి చూపలేదట. దీంతో సీనియర్ హీరోయిన్లు ఇద్దరూ ఈ సినిమాకు అందుబాటులో లేనట్లు సమాచారం. ఈ విషయం గురించి బాలకృష్ణ తో దర్శకుడు బోయపాటి చెప్పగా... బాలకృష్ణ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్తవాళ్లను తీసుకోవాలంటూ బాలకృష్ణ బోయపాటికి  కాస్త గట్టిగానే చెప్పారట. 

 

 

 అయితే మామూలుగానే బాలకృష్ణ కి కోపం ఎక్కువ అన్న విషయం తెలిసిందే.కొత్త  ప్రాజెక్టు విషయంలో... ఆలస్యం జరిగి  సమయం వృధా అయితే సహించారు . ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా కోసం హీరోయిన్ విషయంలో లేటవుతుండడంతో ... కొత్త హీరోయిన్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట బాలకృష్ణ. మరి ఆ కొత్త హీరోయిన్లు ఎవర్ని సెలెక్ట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాలంటే అఫీషియల్ ప్రకటన కావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: