నితిన్ - రష్మిక మందన్న నటించిన భీష్మ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ  నిర్మించారు. ఓవర్సీస్‌ నుంచి ప్రీమియర్ షోలకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన భీష్మ ట్రెండింగ్ జోరుగా సాగుతోంది. నితిన్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హెరెత్తిస్తున్నారు. ఇక నితిన్ అభిమానుల ఆనందానికి అయితే లేవు దర్శకుడు ఓ సాధారణ కథను తీసుకుని దానిని తెరకెక్కించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

 

ట్రైలర్ తోనే కథ తాలూకా థీమ్ ఏమిటి అన్నది రివీల్ చేసేసిన దర్శకుడు సినిమా చూస్తున్నంతసేపు దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే వెంకీ కుడుముల సినిమాను టోట‌ల్‌గా బాగా ప్ర‌జెంట్ చేసినా ఛ‌లో సినిమా విష‌యంలో అత‌డు ఏ మిస్టేక్‌లు అయితే చేశాడో ఈ సినిమాలోనూ అదే రిపీట్ చేసిన‌ట్టు అనిపించింది. సినిమా ఫ‌స్టాఫ్ నుంచి సెకండాఫ్ వ‌ర‌కు ఎక్క‌డా గ్రాఫ్ త‌గ్గ‌కుండా చూసుకున్న వెంకీ కొన్ని విష‌యాల్లో మాత్రం తేలిపోయాడు.

 

చాలా సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్న వెంకీ విల‌నిజం విష‌యంలో మాత్రం వీక్ అయ్యాడు. సినిమా చూశాక  విలనిజంని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది అనిపించింది. అయితే అక్కడక్కడా బెటర్ గా ఉండచ్చు కదా అనే కొన్ని మోమెంట్స్ ఉన్నాయి. వాటిని మ‌రింత బెట‌ర్‌గా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయేది. ఇక ఓవ‌రాల్‌గా వెంకీ తొలి సినిమా ఛలో సినిమాతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని చెప్పాలి.అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీఎఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్,అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు బాగున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: