నితిన్ నటించిన భీష్మ సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భీష్మ టాక్ మోత మోగిపోతుంది. చాలా రోజుల తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న‌ నితిన్ కు ఈ సినిమా ఆ కొరత తీర్చేసింది. ఛలో తో మొదటి హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల రెండవ సినిమా భీష్మతో హిట్ కొట్టి టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో చాలా మంది ఫెయిల్ అయిన ద్వితీయ విఘ్నాన్ని విజ‌య‌వంతంగా అధిగ‌మించాడు.

 

ఇక ఈ సినిమా యూనిట్ ముందు నుంచి సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌స్తుంటే క‌డుపుబ్బా న‌వ్వు కుంటార‌ని.. మీ పొట్ట చెక్క‌ల‌య్యే కామెడీ ఈ సినిమాలో ఉంద‌ని చెపుతూ వ‌చ్చింది. ఇప్పుడు సినిమా చూశాక కూడా అది నిజం అయ్యింది. సినిమా చూశాక‌ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని చాలా హాయిగా థియేటర్ బయటకి వస్తారు. నితిన్ – రష్మికల పెయిర్, కడుపుబ్బా నవ్వించే కామెడీ ఇచ్చింది. అదే టైంలో వెన్నెల కిషోర్ - నితిన్ కామెడీ ట్రాక్ కూడా అదిరిపోయింది.

 

ఇక మంచి హీరోయిక్ మోమెంట్స్ భీష్మకి హైలైట్స్. ఇక ఇంట‌ర్వెల్ మూమెంట్ కూడా అదిరిపోయింది. అయితే వెంకీ సినిమా అంతా బాగా న‌డిపించినా చివ‌ర్లో కొంత డిజప్పాయింట్ చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టి చివరిలో తాంబూలం ఇవ్వకుండా డిజప్పాయింట్ చేసినట్టు క్లైమాక్స్ కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఫైనల్ గా సంక్రాంతి సినిమాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సినిమా భీష్మ‌.

 

మ‌న తెలుగు సినిమా ప్రియుల‌కు సంక్రాంతి సినిమాల త‌ర్వాత స‌రైన సిన‌మా థియేట‌ర్ల‌లో లేక‌పోవ‌డంతో ఫ్యామిలీతో స‌హా ఎంజాయ్ చేసేందుకు థియేట‌ర్ల కు వెళ్ల‌డం లేదు. ఇప్పుడు భీష్మ ఆ కొర‌త తీర్చేసింది. ఇక ఈ సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవ్వాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: