భీష్మ‌కు ఫైన‌ల్‌గా సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. ఓవ‌రాల్‌గా చూసుకున్న‌ట్ల‌యితే చాలా కాలం తర్వాత నితిన్ నుంచి సూప‌ర్ హిట్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. ఇక సినిమా చూసిన వారంద‌రూ కామెడీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫైన‌ల్‌గా చూస్తే భీష్మ మంచి అదిరిపోయే కామెడీ ఎపిసోడ్స్ అలాగే నితిన్ నుంచి మరోసారి మాంచి కామెడీ టైమింగ్ అలాగే లీడ్ జంట మధ్య మంచి కెమిస్ట్రీ వంటివి ప్రధాన హైలెట్స్ అయ్యాయి.

 

ఇక ఓవరాల్ గా మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే నితిన్ ఖాతాలో మరో హిట్ బొమ్మ పడింది అని చెప్పాలి. ఇక ఛ‌లో సినిమాతో తొలి హిట్ అందుకున్న వెంకీ కుడుముల మరోసారి రెండో సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టేశాడు. 2020 సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ చేశాయి. అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో , మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల‌ను సంక్రాంతికి ప్రేక్ష‌కులు మ‌స్త్ గా ఎంజాయ్ చేశారు.

 

ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పైసలు రాబట్టుకోలేకపోయాయి. ఇక శివ‌రాత్రి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నితిన్ భీష్మ మళ్ళీ బాక్స్ ఆఫీస్ కి పని పెట్టేసింది. చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి మస్త్ ఎంటర్టైనర్ దొరికింది. ఇక గ‌త కొన్ని వారాలుగా స‌రైన సినిమాలు లేక బోసి పోయి వెల వెల బోతోన్న థియేట‌ర్లు ఇప్పుడు మ‌ళ్లీ హౌస్ ఫుల్ కానున్నాయి.

 

సంక్రాంతి సినిమాల త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి వెళ్లి ఎంజాయ్ చేసే సినిమ‌లు లేని లోటును భీష్మ తీర్చేసింది. వెంట‌నే ఫ్యామిలీతో స‌హా సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయాల‌నుకునే వాళ్లు వెంట‌నే టిక్కెట్లు బుక్ చేస్కోండి.. ఫ్యామిలీతో స‌హా థియేట‌ర్ల‌లో పొట్ట చెక్క‌లు అయ్యేలా ఎంజాయ్ చేయండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: