నితిన్ భీష్మ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ సినిమా యూనిట్ అప్పుడే శివ‌రాత్రి సంబ‌రాలు స్టార్ట్ చేసేసింది. సినిమాకు అన్ని వైపులా నుంచి పాజిటివ్ టాక్ బాగా వ‌చ్చేసింది. ఇక భీష్మ సూప‌ర్ హిట్ వెన‌క ఈ సినిమాకు కెప్టెన్ అయిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడ‌ములే కాకుండా తెర వెన‌క ప‌ని చేసిన చాలా మంది హీరోలు ఉన్నారు. భీష్మ కి ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు అన్ని వైపులా నుంచి అంద‌రూ ప‌ని చేయ‌డంతో టెక్నిక‌ల్‌గా కూడా బెస్ట్ అవుట్ ఫుట్ వ‌చ్చింది.

 

ఈ సినిమాకు అన్ని డిపార్ట్మెంట్స్ సూపర్బ్ అవుట్ ఫుట్ ఇవ్వడం వలనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల సాధార‌ణ క‌థ‌నే తీసుకున్నా ఇచ్చిన ట్రీట్మెంట్ అదిరిపోవ‌డం సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యింది. ఇక టెక్నిక‌ల్‌గా చూస్తే సాయి శ్రీరామ్ విజువల్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ చాలా క‌ల‌ర్ ఫుల్‌గా క‌నిపించింది. నితిన్ - ర‌ష్మిక మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌లో క‌ళ్లార‌ప్ప‌కుండా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

 

ఇక నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చంతా తెర‌మీద బాగా క‌న‌ప‌డింది. ప్రతి యాక్టర్ ని ఎంతో అందంగా చూపించడం వల్ల ప్రేక్ష‌కులు కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. ఇక సంగీత ద‌ర్శ‌కుడు సాగ‌ర్ స్వ‌ర‌ప‌ర్చిన పాట‌లు సూప‌ర్బ్‌. ఇక నేప‌థ్య సంగీతం కూడా సినిమాతో పాటు ప్రేక్ష‌కులు ట్రావెల్ అయ్యేలా చేసింది. సాగర్ స్వర మహతి అందించిన సింగల్, వాటే బ్యూటీ సాంగ్స్ విజువల్ గా కూడా బాగున్నాయి.

 

ఇక నవీన్ నూలి ఎడిటింగ్ చాలా స్పీడ్ గా, క్లైమాక్స్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. ఎడిటింగ్ చాలా ప‌ర్‌ఫెక్ట్‌గాను, క్రిస్పీగాను ఉంది. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చాలా బాగుంది. స్పెషల్లీ సెకండాఫ్ లో పొలంలో వచ్చే ఫైట్ లో నితిన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్బ్. వాటే బ్యూటీ సాంగ్ లో జానీ మాస్టర్ స్టెప్స్ అదుర్స్.

 


  

మరింత సమాచారం తెలుసుకోండి: