సినిమాలు తీసే నిర్మాతలకైనా.. తెరకెక్కించే దర్శకులకైనా.. నటించే హీరో హీరోయిన్లకైనా సెంటిమెంట్లు ఉంటాయి. సెంటిమెంట్ ప్రకారమే వాళ్లు సినిమాలు చేస్తారు. ఒకసారి హిట్ అయిన కాంబినేషనో, కలిసొచ్చిన లొకేషనో, ప్రారంభోత్సవమో, రిలీజ్ డేట్స్.. ఇలా సెంటిమెంట్ కు కాదేది అనర్హం అన్నట్టు పరిశ్రమలో ఉంటాయి. ఇందులో తప్పేమీ లేదు. అందరూ పాటించేదే. ప్రస్తుతం భీష్మ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఇదే సక్సెస్ మంత్ర ఫాలో అయ్యాడని అంటున్నారు.

 

 

ఛలోతో గ్రాండ్ సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంకీ తొలి సినిమా హీరోయిన్ రష్మిక మందనా. ఆమెకూ తెలుగులో అదే తొలి తెలుగు సినిమా. ఇద్దరికీ మంచి టాలీవుడ్ లో మంచి ఫ్లాట్ ఫామ్ ఇచ్చింది. వెంకీ తన రెండో సినిమాగా తెరెకెక్కించిన భీష్మలో కూడా తన లక్కీ చార్మ్ హీరోయిన్ అయిన రష్మికనే ఈ సినిమాకు తీసుకున్నాడు. వీరిద్దరికీ వరుసగా ఈ కాంబోలో వచ్చిన రెండో సినిమాగా భీష్మ ఇద్దరికీ మలి హిట్ ను అందించింది. ఇక టైటిల్ లో ఛలో రెండక్షరాలతోనే ఉంటుంది. భీష్మకు కూడా అదే ఫాలో అయ్యాడు వెంకీ. ఈ సినిమా ఛలో కంటే భారీ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాలో కామెడీ టైమింగ్ అదిరిపోయింది. స్వతహాగా త్రివిక్రమ్ శిష్యుడు కావడంతో ఈ పాయింట్ పై జాగ్రత్తలు తీసుకున్నాడు వెంకీ.

 

 

ఇవి సెంటిమెంట్లు అనేకంటే తనకు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ఏదో ఒక ఫ్యాక్టర్ అందరూ సక్సెస్ అవుతున్న వారే. సినిమాకు ముందు గుళ్లకు వెళ్లడం, సినిమాకు ఒకే అక్షరంతో టైటిల్స్ పెట్టడం.. ఇలా కొందరు సక్సెస్ మంత్రను ఫాలో అవుతూంటారు. వెంకీ కుడుముల కూడా అదే లైన్ లో హిట్ కొట్టాడని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: