టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, ఆ తరువాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందంతో మరొక సూపర్ స్టార్ కొట్టి, మంచి పేరు దక్కించుకుంది. ఇక తొలి సినిమా నుండి తన అందంతో పాటు ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న రష్మిక, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లో కూడా నటించడం జరిగింది. మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ వెంటపడుతూ ఎంతో అల్లరి చేస్తూ సినిమా మొత్తం తన నటనతో ఆకట్టుకున్న రష్మిక, ఇక నేడు భీష్మ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మంచి కామెడీ తో పాటు యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా పై పలువురు ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇక ముఖ్యంగా హీరో నితిన్, హీరోయిన్ రష్మికల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఎంతో బాగున్నాయని, అలానే రష్మిక గ్లామర్ ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణగా చెప్తున్నారు. 

 

సినిమాలోని రెండు సాంగ్స్ లో రష్మిక డాన్స్ అదిరిందని, ఈ విధంగా వరుసగా రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఏ నక్కతోక తొక్కిందో కాస్త మిగతా హీరోయిన్లకు కూడా చెప్తే, పాపం వాళ్ళు కూడా హిట్స్ అందుకుంటారు కదా అంటూ పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, తన తొలి సినిమా ఛలో లో రష్మికను హీరోయిన్ గా పరిచయం చేసి హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ, ఈ సినిమా ద్వారా ఆమెకు మరొక హిట్ ని అందించడం. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ సినిమాతో పాటు మరొక తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, వాటితో ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: