తెలుగు ఇండస్ట్రీలో వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్నారు కొంత మంది యంగ్ హీరోలు.  గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు హీరో రామ్ పోతినేని. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు హీరో నితిన్.  తాజాగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ‘భీష్మ’ ఈ రోజు రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం ప్రీమియం టాక్ పాజిటీవ్ టాక్ వస్తుంది.  ఈ చిత్రంలో నితిన్ సరికొత్తగా కనిపిస్తున్నాడని.. ఫుల్ లెన్త్ కామెడీతో బాగా అలరించారని టాక్ వినిపిస్తుంది. 

 

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన వెంకీ కుడుముల విషయానికి వస్తే.. తన మొదటి సినిమాలానే ఇందులో కూడా తను స్ట్రాంగ్ అయిన కామెడీ అనే బ్రహ్మాస్త్రంతో అందరినీ మెప్పించాడు. రైటర్ తానే కావడం వలన స్టోరీ లైన్ చాలా చిన్నదైనప్పటికీ ట్రీట్మెంట్, కామెడీ అండ్ టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించేసాడు. తాను రాసుకున్న సీన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి కానీ ఎప్పటిలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి తేల్చేసాడు. కథలో హీరో – విలన్ కి గట్టి పోటా పోటీ సీన్స్ పెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ సరిగా వాడుకోలేదు.

 

చాలా సింపుల్ గా ఫినిష్ చేసేసాడు. కథ పరంగా చాలా సింపుల్ అయినప్పటికీ తన మార్క్ కామెడీ, లవ్ సీన్స్, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించి చాలా మంది దాటలేని ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై అందంగా కనిపించి, ఆహ్లాదాన్ని పంచిందని చెప్పాలి. ఏది ఏమైనా కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎంతో కరువుతో ఉన్న నితిన్ ఈసారి సూపర్ హిట్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: