యంగ్ హీరో నితిన్ ఖ‌చ్చితమైన టైమింగ్ చూసి అదిరిపోయే బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టేశాడు. ఛ‌ల్ మోహనరంగా , శ్రీనివాస కళ్యాణం, లై లాంటి మూడు వరుస ప్లాప్‌ సినిమాలతో తర్వాత మ‌నోడి కెరీర్ అగ‌మ్య గోచ‌రంగా మారింది. మూడు వరుస ఫ్లాపులతో నితిన్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైమ్ లో తాను ప్రేమించిన షాలినీ రెడ్డితో నితిన్‌ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది. కెరీర్ ప‌రంగా దాంపత్య జీవితంలోకి నితిన్ అడుగుపెడుతున్న వేళ... అన్ని విధాలా కలిసి వచ్చిన వేళా విషేష‌మో ఏమో గాని ఈ సినిమాతో నితిన్ బంపర్ హిట్ కొట్టాడు.

 

అయితే ఈ సినిమా విషయంలో నితిన్ ఖచ్చితమైన టైమింగ్‌తో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంతో  అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. వాస్త‌వంగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఛ‌లో సినిమా హిట్ అయ్యాక ఈ క‌థ ర‌ఫ్ గా రాసుకుని వెళ్లి నితిన్‌కు వినిపించ‌డ‌ట‌. అయితే అప్ప‌టికి ఫుల్ స్క్రిఫ్ట్ రెడీ కాక‌పోవ‌డంతో నితిన్ ఓకే చెపుతాడా ?  లేదా వ‌ద్దంటాడా ? అన్న సందేహాలు కూడా వెంకీకి ఉన్నాయ‌ట‌.

 

ఎట్ట‌కేల‌కు నితిన్ ఏం కంగారు వ‌ద్దు... బౌండెడ్ స్క్రిఫ్ట్ తోనే సెట్‌కి వెళదాం... నేను వెయిట్‌ చేస్తా అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నార‌ని.. చివ‌ర‌కు ఫైన‌ల్‌గా స్క్రిఫ్ట్ లాక్ అయ్యాకే షూటింగ్‌కు వెళ్లామ‌ని ... ఇప్పుడు సినిమా సూప‌ర్ టాక్‌తో దూసుకు వెళ్ల‌డంతో త‌మ‌కు ఆనందంగా ఉంద‌ని వెంకీ చెపుతున్నాడు.

 

ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. ఏదేమైనా ఈ సినిమా కోసం దాదాపుగా సంవ‌త్స‌రం పాటు వెయిట్ చేసిన నితిన్ న‌మ్మ‌కం ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ రూపంలో నిజం అయ్యింది. అదే ఆనాడు నితిన్ మ‌రో సినిమా కోసం కంగారు ప‌డి ఉంటే మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ మిస్స‌యేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: