తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కంటెంట్ ఉన్న చిత్రాలకు కటౌట్స్ అవసరం లేదని పలుమార్లు రుజువు అయ్యాయి.  చిన్న చిత్రాలు సైతం మంచి కంటెంట్ తో రావడంతో సూపర్ హిట్ అవుతున్నాయి. తాజాగా ఛలో ఫేమ్ వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక మందన నటించిన ‘భీష్మ’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో ప్రీమియం టాక్ కూడా పాజిటీవ్ గానే వచ్చింది.  భీష్మ విషయంలో పెర్ఫార్మన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తెరపై కనిపించిన ప్రతి యాక్టర్ అదరగొట్టేసారు. ఒకరికి మించి ఒకరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు.

 

ఇక డీటైల్ గా చూస్తే.. నితిన్ సింపుల్ అండ్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా వెన్నల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లతో కాంబినేషన్ సీన్స్ లో కామెడీ టైమింగ్ అదిరింది. ఇక రష్మిక మందన్న కూడా బబ్లీ బబ్లీ పాత్రలో సూపర్బ్ గా చేసింది. నితిన్రష్మిక పెయిర్ కూడా ఆన్ స్క్రీన్ వాటే వాటే బ్యూటీ అనేలా ఉంది. వెన్నెల కిషోర్, రఘుబాబు మద్య వచ్చే కామెడీ థియేటర్లలో కూర్చుకున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సంపత్ రాజ్, నితిన్ కి మద్య కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. 

 

ఈ చిత్రంలో బ్రహ్మాజీ కామెడీ హైలెల్ అని చెప్పొచ్చు.  హీరోహీరోయిన్ల విషయానికి వస్తే నితిన్ గతంలో లేని విధంగా ఈ చిత్రంలో తనదైన కామెడీతో అలరించారు.  ఇటీవల వరుస విజయాలతో దుమ్మురేపుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన సైతం తన నటనతో అబ్బురపరిచింది.   భీష్మ చిత్రం విషయానికి వస్తే.. కంటెంట్ పరంగా బాగా ఆకర్షించింది.  ఈ తెరపై కథ బాగా డామినేట్ చేసింది.  ఒక రకంగా చెప్పాలంటే.. నితిన్, రష్మికలు కాదు వారి క్యారెక్టర్స్ బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాయని అంటున్నారు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: