చిత్రపరిశ్రమలో నిర్మాత కష్టాలు ఎవరికి పట్టవన్నట్లుగా ఉంది.. ఒక సినిమా తీయాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి. అన్నీంటికి నిర్మాతే ముఖ్యుడు కాబట్టి అతని మీద పడే భారం అంతా ఇంతా కాదు.. చిన్న చీపురు పుల్ల దగ్గరి నుండి ప్రతీది లెక్కేసుకుంటే తాను తీసే సినిమా ముగిసేసరికి నిర్మాత దగ్గర గోచీ తప్ప ఏది మిగలని పరిస్దితి. ఎందుకంటే ప్రతి ఆర్టిస్టు రెమ్యూనరేషన్ మామూలు రేంజ్‌లో లేదు కదా అందుకే..

 

 

ఇకపోతే హీరోయిన్ మెహ‌రీన్ నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలలో నటించి మంచి పేరు కొట్టేసింది. ఇదిలా ఉండగా, ఈ అందాల బొమ్మ తాను చేసిన సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నిర్మాత జేబులు ఖాళీ  చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుందట.... అయితే ఇంతకాలం ఈ విషయం మాత్రం భయటికి రాలేదట. కానీ తాజాగా మెహ‌రీన్ నటించిన ఎంత మంచి వాడ‌వురా చిత్రంతో ఈ విషయం బయటపడిందట.

 

 

ఇక  సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ని తెచ్చిపెట్టింది.. అయితే దీనికంటే ముందు ఈ సినిమా ప్రమోష‌న్లో భాగంగా మెహ‌రీన్ నాలుగు రోజుల‌కు గానూ ఐదు నుంచి ఆరు డ్రెస్సులు మార్చింద‌ట‌. అంతేకాకుండా స్పాలకు వెళ్లడం, ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో భోజ‌నం మొదలగు వీటి కారణంగా మొత్తం బిల్లు  50 వేల‌కు మించి అయింద‌ని ప్రచారం సాగుతోంది.  

 

 

ఇదే కాకుండా కేవ‌లం త‌న డ్రెస్సుల లాండ్రీకే 50 వేలు దాటింద‌ని చెబుతున్నారు. దీంతో చేసేది లేక నిర్మాత‌లు ఆ మొత్తాన్ని చెల్లించిన‌ట్టు టాలీవుడ్‌లో ప్రచారం జ‌రుగుతోంది. ఇలా ఈ ఒక్క సినిమా విష‌యంలోనే కాకుండా అంత‌కు ముందు చిత్రానికి కూడా మెహ‌రీన్ ఇలాగే చేసింద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: