టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఈ భామ ప్రస్తుతం పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. వరుస సీనియర్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను అదే ఫాం కంటిన్యూ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామహాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. యంగ్ హీరో మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న హాలీవుడ్ సినిమా మోసగాళ్ళు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ లుక్‌ను శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు.

 

ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు కాజల్ అగర్వాల్. మంచు విష్ణు నటిస్తోన్న మోసగాళ్ళు సినిమాలు కాజల్ డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఇదివరకు కాజల్ చేసిన పాత్రలకు ఇది భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మోసగాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్ర కథాంశం తయారు చేశారు.

 

ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన చిత్ర యూనిట్ సోమవారం నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. వయా మార్ ఎంటర్‌ టైన్మెంట్స్‌ మరియు ఏవిఏ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విరోనిక మంచు నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: