శిల్పాశెట్టి.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ పేరులోనే ఉన్నట్టు అందమైన శిల్పి ఉలి పట్టుకొని చెక్కినట్టు ఉంటుంది శిల్పాశెట్టి శరీర సౌష్ఠవం. ఈ బ్యూటి వ్యాపార‌వేత్త‌ రాజ్‌కుంద్రాని 2009 నవంబర్ 22న ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌ద‌మూడేళ్ళ‌కి పైగా వెండితెర‌కి దూరంగా ఉంటున్న శిల్పా తాజాగా పండంటి ఆడపిల్లకు తల్లయ్యారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. 

 

స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు.. రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌’’అని శుక్రవారం శిల్పాశెట్టి ఇన్‌స్టాలో తెలిపింది. అయితే పాపను ఆమె నవమాసాలు మోసి కనలేదనుకోండి. సరోగసీ ద్వారా రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు. ఏదేమైనా శివరాత్రి పర్వదినాన లక్ష్మిదేవి వాళ్లింట్లో అడుగుపెట్టిందనే చెప్పాలి. 

 

ఇక వెండితెర‌కి దూరంగా ఉంటున్న శిల్పా ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ప‌లు ఆస‌నాల వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని క‌లిగిస్తుంది. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన  శిల్పాశెట్టి ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ జంట‌కు  వియాన్ అని ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మ‌రోవైపు చాలా కాలం తర్వాత శిల్ప మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా హంగామా 2. ఇందులో పరేష్ రావల్, మీజాన్ జాఫ్రే,ప్రణీతా సుభాష్ కీలక పాత్రలు పోషించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: