అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది కాజల్ అగర్వాల్. ఇప్పటికే యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తూ.. ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు పోటీగా ఇస్తూనే ఉంది. అయితే తాజాగా మంచు విష్ణు కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో ఓ  చిత్రం రాబోతుంది. జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మోసగాళ్లు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో  నటిస్తున్నారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మోసగాళ్లు టీం కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. 

 


 కాగా కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు అను అంటూ వెల్లడించింది చిత్రబంధం. కాగా ఈ ఫస్ట్ లుక్ లో స్లీవ్లెస్ ప్లెజర్ ధరించి... చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చేతిలో వాచ్ తో  ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తరహాలో నిలిచింది కాజల్ అగర్వాల్. అయితే ఈ సినిమా కథ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్  కు సంబంధించింది అంటూ పోస్టర్ లో  కూడా తెలిపారు. అయితే చందమామ లాంటి అందమైన కాజల్ పాప ఈ స్కామ్  లో ఎలాంటి పాత్ర పోషించపోతుంది... సూత్రధారి గానా.. పాత్రధారి గానా .. లేదా ఈ స్కామ్ కు వ్యతిరేకంగా పని చేస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 


 కాగా మోసగాళ్లు చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈమధ్య మోసగాళ్లు చిత్రబృందం అమెరికాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. ఇక త్వరలో ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన రెండవ షెడ్యూల్ ని కూడా హైదరాబాద్ లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఏవిఏ  ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఓ వైపు మంచు విష్ణు మరోవైపు కాజల్ అగర్వాల్ లు  కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. మరి ఈ మోసగాళ్ళు ఇద్దరికీ మంచి విజయాన్ని అందిస్తుందో లేదో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: