టాలీవుడ్ లో మోహన్ బాబు అంటే ఓ ప్రత్యేకం అని చెప్పొచ్చు.  ఆయన నటన, డైలాగ్స్ ఎంతో ప్రత్యేకత ఉంటుంది.  నవరసాలు పలికించగల సత్తా ఆయన నటనలో ఉంది.  విలక్షణ నటుడిగా మోహన్ బాబు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పొచ్చు.  సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఆయన ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించారు. మోహన్ బాబు కెరీర్ లో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించారు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి ఇలా ఏ హీరో అయినా వారికి తగ్గట్టుగా నటించి మెప్పించే వారు.  దాసరి నారాయణరావు శిష్యుడిగా ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.  ప్రస్తుతం ఆయన తనయులు హీరోలుగా నటిస్తున్నారు.  

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ ఇంట మహేశ్వరుడిని ఎలా పూజిస్తాం.. అన్న విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తల్లిదండ్రులు ఈశ్వరుడికి మొక్కుకుంటే తాను పుట్టానని మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయన వెల్లడించారు.  మాది తిరుపతి-కాళహస్తిల మధ్య ఉన్న చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం. మా తల్లిదండ్రులకు పెళ్లైన చాలా కాలం పాటు సంతానం లేకపోవడంతో ఎంతో బాధపడుతున్నారట. ఆ సమయంలో వారికి ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే... అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి  మొక్కుకుంటే మీకు తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పారట.

 

 ఆ ప్రకారమే మా తల్లిదండ్రుల చేశారు.. మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు.  ఈశ్వరుడిపై ఉన్న భక్తితో నాకు మా నాన్నగారు భక్తవత్సలం అని పేరు పెట్టారని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది.  కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమే. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వదినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: