తమిళ్ హీరో విజయ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ కన్నడలో నే కాదు తెలుగులో కూడా విజయ్ కి స్టార్ హీరో రేంజ్ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే మామూలుగానే తెలుగు హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే తమిళ హీరోల రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనే టాక్ ఉంది. ఇక తాజాగా విజయ్ రెమ్యునరేషన్ గురించి  ప్రస్తుత ఓ వార్త  హల్ చల్ చేస్తోంది. అయితే సినీ ఇండస్ట్రీలో గత పదేళ్లకు ముందు హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే ఇప్పుడు రెమ్యునరేషన్ మాత్రం రెండు మూడు రెట్లు కొంతమందికి పదిరెట్లు కూడా పెరిగిపోయింది. తమ సినిమాలు విజయం సాధించిన కొద్దీ  రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తున్నారు హీరోలు.. 

 

 

 దీంతో అటు నిర్మాతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అందుకుంటుండడంతో.. పారితోషికాన్ని భారీగా పెంచేస్తున్నాడు. ఇక అటు విజయ్ సినిమాలు కూడా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ఈజీగా 150 కోట్ల వసూళ్లను రాబడుతోన్నాయి. దీంతో విజయ్ కూడా పారితోషికాన్ని భారీగా పెంచుతూ పోతున్నాడు. బిగిల్  చిత్రానికి దాదాపు 70 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న విజయ్  ఇప్పుడు మాస్టర్  చిత్రం కోసం ఏకంగా వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. 

 


 తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్.. మొత్తం ఆయన తీసుకున్నాడు. అక్కడ సినిమా వంద కోట్లకు మించి బిజినెస్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. తమిళంతో పాటు కేరళలో కూడా విజయ్ కి మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా విజయ్ నటించిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ కారణంగానే విజయ్ సినిమాకు నిర్మాతలు ఎంత పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ప్రతి సినిమా కచ్చితంగా 150 కోట్లు వసూలు చేస్తున్న ఈ క్రమంలో 100 కోట్ల పారితోషికాన్ని విజయ్ కి  ఇవ్వగా 30 నుండి 40 కోట్ల సినిమా  బడ్జెట్.. ఇక నిర్మాతకు 10 కోట్ల లాభం ఇది కేవలం సినిమా మామూలుగా ఆడితేనే.. అదే హిట్ అయితే మాత్రం లాభాల పంట పండినట్లే. ఈ విధంగా నిర్మాతలు విజయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతోన్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో విజయ్ అంతటి పారితోషకం తీసుకుంటున్న హీరో ఎవరూ లేరనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: