టాలీవుడ్ లో ఉవ్వెత్తున దూసుకొచ్చిన హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో హిట్ కొట్టాడనుకుంటే.. ఏకంగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో అతి తక్కువ టైమ్ లోనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో వేరే హీరో చేసినా కూడా విజయ్ పేరు బాలీవుడ్ లో మోగిపోయింది. సౌత్ లో కూడా ఎంతటి క్రేజ్ వచ్చిందంటే ఏకంగా డైరక్ట్ గా తమిళ్ లో కూడా సినిమా చేసేశాడు. ఇంత క్రేజ్ సంపాదించిన విజయ్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

 

 

నోటా, డియర్ కామ్రేడ్ ఫ్లాపులైతే వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం విజయ్ దేవరకొండ మార్కెట్ పై పెను ప్రభావం చూపించింది. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా డెఫిషిట్ కి వచ్చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు నితిన్ భీష్మ సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా దెబ్బకు విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ కథ ముగిసినట్టేనని తెలుస్తోంది. ఈ సినిమాతో దాదాపు 20కోట్ల లాస్ లోకి వెళ్లిపోయాడని అంటున్నారు. నిర్మాతను ఆదుకోవడానికి విజయ్ కొంత అమౌంట్ సర్దుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క మైత్రీ వాళ్లు విజయ్ హీరోగా ఓ షెడ్యూల్ కూడా తీసారంటున్న హీరో సినిమా కూడా ఆగిపోయిందని తెలుస్తోంది.  

 

 

విజయ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కాబట్టి భారీ బడ్జెట్ కు బదులు చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు రౌండ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వార్తలపై క్లారిటీ లేకపోయినా ఫిలింనగర్ లో మాత్రం జోరుగా చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమానే విజయ్ దేవరకొండను కాపాడాలేమో మరి.

                         

మరింత సమాచారం తెలుసుకోండి: