మాటల మాంత్రికుడు, యాంగ్ టైగెర్ ఎన్టీఆర్ ల మరో సినిమా తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు సందడే సందడి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సామెత సినిమా అభిమానుల నుండి ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలిసిందే. అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం కావడంతో త్రివిక్రమ్ మంచి జోష్ లో ఉన్నారు. 

 

ఇప్పుడు ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు చక్కటి కథ వినిపించారు. గురూజీ కథ చెప్పడం, హీరో నో చెప్పడం ఎక్కడైనా ఉంటుందా? కథ వినగానే తారక్ ఓకే చేసేసారు. సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు2 అనే టైటిల్ అనుకుంటున్నారట. హీరో, డైరెక్టర్ ఓకే.. మరి హీరోయిన్ సంగతేంటి? అనుకుంటున్నారా.

 

ఆమె ఎవరో కాదండీ..మన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈసారి గురూజీ పూజతో హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి పనిచేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో పూజ హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’నూ ఆమె హీరోయిన్. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీయబోతున్న సినిమాలోనూ పూజనే తీసుకోవాలని గురూజీ అనుకుంటున్నారట. 

 

అయితే చూసిన హీరోయిన్‌నే ఎన్నిసార్లు చూడాలని ఇండస్ట్రీకి చెందిన కొందరు త్రివిక్రమ్‌కు సలహా ఇస్తున్నారట. ఎన్టీఆర్‌ తో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఇతర హీరోయిన్స్‌ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సెంటిమెంట్స్ బాగా నమ్ముతారన్న సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు త్రివిక్రమ్ మరో సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అదేంటంటే.. ఒకే హీరోయిన్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే అవి హిట్ అవుతాయట. గతంలో సమంతతో కలిసి రెండు సార్లు సినిమా చేసిన త్రివిక్రమ్ మంచి విజయాలు అందుకున్నారు. అదే ఫార్ములాను పూజా హెగ్డేపై ప్రయోగించాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: