మెగాస్టార్ చిరంజీవి, నయా సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి నటిస్తే.. బాక్సాఫీస్ మోతమోగినట్టే. ఈ కాంబినేషన్ ని ఓ స్టార్ డైరెక్టర్ కలపాలని ట్రై చేస్తున్నట్టు ఓ సెన్సేషనల్ టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, కొరటాల శివ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నట్టు న్యూస్ చక్కర్లు కొడుతోంది.

 

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు కాంబినేషన్ పరంగా కూడా కొరటాల ఆడియన్స్ కు థ్రిల్ కలిగించాలని ప్లాన్ చేస్తున్నాడట. నక్సలైట్ పాత్రలో చరణ్ నటిస్తున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తుండగానే ఇప్పుడు మహేశ్ బాబు కూడా నటించబోతున్నాడంటూ మరో సెన్సేషనల్ వార్త చక్కర్లు కొడుతోంది.

 

తాజాగా చిరు 152 నుంచి చరణ్ తప్పుకున్నాడని టాక్. ఆర్.ఆర్.ఆర్ పూర్తయ్యే వరకు మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించొద్దనేది రాజమౌళి, చరణ్ కు కండీషన్ పెట్టాడట. దీంతో చెర్రీ, డాడీ చిరంజీవి సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చరణ్ తప్పుకోవడంతో కొరటాల శివ ఇప్పుడు ఆ పాత్ర కోసం చరణ్ రేంజ్ లోనే ఓ ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. 

 

చిరంజీవి యంగ్ పాత్రకోసం కొరటాల శివ స్టార్ డమ్ ఉన్న హీరోలనే ట్రై చేస్తున్నాడట. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును లేదా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చిరు యంగ్ ఏజ్ పాత్ర కోసం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. కొరటాల, మహేశ్ బాబు కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ఈ న్యూస్ నిజమా కాదా తెలియదు కానీ నిజమైతే కనుక ఆడియన్స్ కు పండుగే.. బాక్సాఫీస్ దద్దరిల్లినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: