గ్లామర్ రోల్స్ కు ఎవరూ మినహాయింపు కాదా.. నిన్నటి వరకు రష్మిక మినహాయింపు అనుకుంటే.. ఈ అమ్మడు నాకేం తక్కువ అంటోంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.

 

నిన్నటి వరకు పద్దతిగా కనిపించిన రష్మికకు ఏమైందని కొందరనుకుంటే.. అందరి మాదిరే ఈ కన్నడ బ్యూటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 

గ్లామర్ కు దూరంగా ఉండే హీరోయిన్స్ ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఈ లిస్ట్ లో రష్మిక కూడా ఉందనుకున్న వారికి ఈ వాటే బ్యూటీ షాక్ ఇచ్చింది. సినిమాలో గ్లామర్ గా కనిపించే ఛాన్స్ దక్కకపోతే.. వేడుకల్లో ఇలా రెచ్చిపోతారా అనిపించేలా భీష్మ ప్రీరిలీజ్ వేడుకకు క్లీవేజ్ అందాలతో దర్శనమిచ్చింది. ఈవెంట్ కు ముందే ఇదే డ్రస్ తో హాట్ హాట్ గా ఫోటో షూట్ కూడా ఇచ్చి హీట్ పెంచింది. 

 

ఛలోతో పరిచయమైన రష్మిక.. గీత గోవిందంతో స్టార్ డమ్ దక్కించుకుంది. ఆ తర్వాత నటించిన దేవదాస్. డియర్ కామ్రేడ్ నిరాశపరిచాయి. సరిలేరు నీకెవ్వరు హిట్ తో జోరుమీదున్న రష్మిక భీష్మతో అదృష్టం పరీక్షించుకుంది. ఛాన్స్ రాలేదు కానీ.. వస్తే స్కిన్ షోకు రెడీ అంటూ.. సరిలేరు నీకెవ్వరులోని మైండ్ బ్లాక్ సాంగ్ తో నిరూపించింది.

 

ఇంతకాలం పక్కింటి అమ్మాయి రోల్స్ తో మెప్పించిన రష్మిక.. హాట్ హాట్ గా రెచ్చిపోతోంది. పూజాహెగ్డే.. కియారా లాంటి స్టార్స్ తో పోటీ పడాలంటే గ్లామర్ కు తెరలేపాలన్న ఫార్ములాను నమ్ముకుందనుకుంట.

 

మొత్తానికి రష్మిక మందన కుర్రకారు కలల రాణిలా మారిపోయింది. పద్ధతిగా.. సంప్రదాయ దుస్తుల్లో ఇన్నాళ్లు కనిపించిన రష్మిక యూత్ మతిపోగొట్టేలా ప్రవర్తిస్తోంది.

 

ఈ అమ్మడి ప్రవర్తన చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమాయకంగా కనిపించిన ఈ బ్యూటీ ఇలా అయిపోతుందేంటి అని చెవులుకొరుక్కుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: